నేపాల్‌ సంస్థతో ఫ్లిప్‌కార్ట్‌ జోడీ..

Flipkart Ties with Nepals Leading Sastodeal  - Sakshi

ముంబై: ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎమ్‌ఈ) రంగంలో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్‌ ఈ కామర్స్‌ దిగ్గజం సాస్టోడీల్‌తో కలిసి పనిచేయనుంది. సాస్టోడీల్‌కు చెందిన 5,000 ఉత్పత్తులను ఫ్టిప్‌కార్ట్‌ సంస్థలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్ హెడ్‌ జగజీత్‌ హరోడే స్పందిస్తూ.. ఫ్లిప్‌కార్ట్‌, సాస్టోడీల్‌ కలయికతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, దేశీయ అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు సాస్టోడీల్‌ సీఈఓ అమున్‌ థాపా స్పందిస్తూ.. ఫ్లిప్‌కార్ట్‌తో జోడీ వల్ల నేపాల్‌లోని వినియోగదారులకు మెరుగైన క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు.

ఇరు సంస్థలు కలయికతో ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లెయెన్సెస్‌, ఫర్నిషింగ్స్ తదితర విభాగాలలో మెరుగైన సేవలు అందిస్తామని సంస్థల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నేపాల్‌, భారత వినియోగదారుల అభిరుచులు ఒకే విధంగా ఉంటాయని  సాస్టోడీల్‌ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఫ్లిప్‌కార్ట్‌కు 2లక్షల మంది అమ్మకందార్లు ఉన్నారని, 50శాతం ఉత్పత్తులు జైపూర్‌, లక్నో, మీరట్‌, కాన్‌పూర్‌, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌ తదితర నగరాల నుంచే వస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. 
చదవండి: ఫ్లిప్‌కార్ట్ సేల్ : బంపర్ ఆఫర్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top