
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. నేడు (ఆగస్టు 6) నుంచి ఈ సేల్ 5 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 10న ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ ఉత్పత్తులపై అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. (అమెజాన్ ప్రైమ్ డే సేల్ : భారీ డిస్కౌంట్లు)
అమేజింగ్ డీల్స్
ఐఫోన్ ఎస్ఈ 2020 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,501 రూపాయల ధర తగ్గింపుతో 36,999 రూపాయలకు కొనుగోలుచేయవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా సిటీబ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
ఐఫోన్ ఎస్ఈ 128జీబీ స్టోరేజ్ మోడల్ 41,999 కు లభ్యం. అసలు 47,800 రూపాయలు
256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను 51,999 రూపాయలకు అందిస్తోంది. అసలు ధర రూ. 58.300.
ఈ రెండు మోడళ్లపై క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా రూ .1,500 డిస్కౌంట్ అదనం.
ఐఫోన్ ఎక్స్ ఆర్ 44,999 రూపాయలకే లభ్యం. ఎంఆర్‌పీ 52,500 రూపాయలు.
ఎల్‌జీ వీ 30 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 19,999 రూపాయలకే అందిస్తోంది. ఎంఆర్‌పీ రూ .60,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో 13,650 రూపాయలు తగ్గింపు.