ఐఫోన్‌ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్‌ | Flipkart offering deals on iPhone 16 Pro and iPhone 16 Pro Max | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్‌

Jun 23 2025 2:50 PM | Updated on Jun 23 2025 3:54 PM

Flipkart offering deals on iPhone 16 Pro and iPhone 16 Pro Max

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌ 16పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై ధరల తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్ వంటి రాయితీలను ప్రకటించింది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజ్‌ చేసి ఐఫోన్‌ 16 సిరీస్‌ తీసుకుంటే పాత ఫోన్‌ కండిషన్‌ను అనుసరించి గరిష్ఠంగా రూ.48,150 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చని పేర్కొంది.

బేస్ 128 జీబీ ఐఫోన్ 16 ప్రో సాధారణంగా రూ.1,19,900గా ఉంది. ఎక్స్చేంజ్‌ తర్వాత 8% తగ్గింపు అంటే రూ.10,000 రాయితీతో రూ.1,09,900కు వస్తుంది. రూ.1,29,900గా ఉన్న 256 జీబీ వేరియంట్ ధర 5 శాతం తగ్గుదలతో రూ.1,22,900కు చేరింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై కూడా డిస్కౌంట్ ఉంది. రూ.1,44,900 విలువైన 256 జీబీ వేరియంట్ ధర 8 శాతం తగ్గింపుతో రూ.1,32,900కు చేరింది.

ఇదీ చదవండి: అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్‌

ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,57,900 (రూ.1,64,900 నుంచి తగ్గింది), 1 టీబీ వేరియంట్ ధర రూ.1,84,900 నుంచి రూ.1,77,900కు తగ్గింది. ఈ రాయితీలు పోను ఎక్స్ఛేంజ్‌ ధర అదనంగా పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. పాత ఐఫోన్లు లేదా ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల నుంచి అప్‌గ్రేడ్‌ అయ్యేవారికి ఇదో మంచి అవకాశం అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement