Today StockMarketClosing: ఫ్లాట్‌ ముగింపు, ఐటీ ఢమాల్‌

Flat Market Sensex closed at 62792 it drags - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. ఫ్లాట్‌ ఆరంభంనుంచి బలహీనమైన అంతర్జాతీయ ప్రతికేల సంకేతాలతో ప్రధాన సూచీలు మందకొడిగా కొనసాగాయి.  మిడ్‌సెషన్‌లో  భారీగా నష్టపోయింది. చివరి 30 నిమిషాల్లో  కొనుగోళ్లతో నష్టాలనుంచి తేరుకుంది.  స్వల్ప లాభాలకు పరిమితమైనా కీలక మద్దతుస్థాయిలకుపైన ముగసింది.  (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం)

5 పాయింట్ల  లాభంతో 62,793 వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీ  5 పాయింట్లు  లాభపడి 18599 వద్ద ముగిసింది.  ఆటో, బ్యాంకు రంగ షేర్లు  లాభపడగా  ఐటీ  అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్‌కు దారితీసింది. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

అటు డాలర్‌తో పోలిస్తే  దేశీయ కరెన్సీ రూపాయి  29 పైసలు పతనమై 82.68 దగ్గర నిలిచింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top