మస్క్‌ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి | Errol Musk criticize ​his son elon musk vision for interplanetary travel | Sakshi
Sakshi News home page

మస్క్‌ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి

Jun 4 2025 5:28 PM | Updated on Jun 4 2025 5:42 PM

Errol Musk criticize ​his son elon musk vision for interplanetary travel

అంతరిక్ష సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్‌ కంపెనీల్లో కీలకంగా ఉన్న స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌మస్క్‌ ఆలోచనలను ఆయన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ వ్యతిరేకించారు. ఎలాన్‌ మస్క్ ప్రస్తుతం చేస్తున్న గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఎర్రోల్‌ మస్క్‌ విమర్శలు గుప్పించారు. రాకెట్లు మానవులు, ఇతర గ్రహాలను కాలనీలుగా మారుస్తాయని మస్క్‌ అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎర్రోల్‌ మస్క్‌ తోసిపుచ్చారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. శాస్త్రీయంగా లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు.

ఎలాన్‌ మస్క్‌ దీనికి బదులుగా గురుత్వాకర్షణ, అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని కుదించేలా అధ్యయనం చేయడం మేలని ఎర్కోల్‌ మస్క్‌ చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో ఈమేరకు చేసే అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కృషిని ప్రస్తావిస్తూ మానవాళి కేవలం రాకెట్లపై ఆధారపడకుండా లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదీ చదవండి: ‘ఆర్టిఫిషియల్‌’ మూవీ.. ఎవరి గురించి అంటే..

స్పేస్ఎక్స్ ద్వారా అంగారక గ్రహంలో మానవుల నివాసానికి అనువుగా ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement