ఎటు చూసినా జాబులే! 2రోజుల్లో క్యాంప‌స్ ఖాళీ..ప్లేస్‌మెంట్‌లో విద్యార్ధుల జాక్ పాట్!!

Entire Batch Hired In Two Days From The Indian Institute Of Management Bangalore - Sakshi

పెరిగిపోతున్నటెక్నాల‌జీ కార‌ణంగా ఉద్యోగులు అవ‌స‌రం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ‌చ్చి ప‌డుతున్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు క్యాంప‌స్ ప్లేస్ మెంట్ నిర్వ‌హించి ఊహించిన దానికంటే ఎక్కువ జీతాలిచ్చి మ‌రి ఫ్రెష‌ర్స్ ను ఎంపిక చేసుకుంటున్నాయి. 

తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరు (ఐఐఎం-బీ) రెండు రోజుల పాటు క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించింది. ఈ ఇంట‌ర్వ్యూల్లో ఎంబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్ధులు జాక్ పాట్ కొట్టారు. ఏకంగా 662 మంది విద్యార్ధులు ప్ర‌ముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించిన‌ట్లు ఐఐఎం-బీ ప్ర‌తినిధులు తెలిపారు.  

క్యాంప‌స్ సెల‌క్ష‌న్‌ల‌లో యాక్సెంచర్ కు 51, అమెజాన్31, బీసీజీ 30, కెర్నీలో 27 మంది విద్యార్ధులు ఉద్యోగం సంపాదించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉద్యోగం పొందడంలో 37 శాతం వృద్ధి సాధించారు. అందులో కన్సల్టింగ్, ప్రొడ‌క్ట్ సంబంధిత రంగాలు ఉండ‌గా..స్ట్రాటజీ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగం చేసేందుకు విద్యార్ధులు మ‌క్కువ చూపుతున్నారు. ఆ త‌ర్వాత ప్రొడ‌క్ట్ నిర్వ‌హ‌ణ‌, ఫైనాన్స్ విభాగాలు ఉన్నాయి.  

కన్సల్టింగ్ కంపెనీలు 248 ఆఫర్‌లను అందించాయి. యాక్సెంచర్,బీసీజీ, కెర్నీ కాకుండా, బైన్ అండ్‌ కో 26, మెకిన్సే అండ్‌ కో 22 , ఎఫై9, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ 9, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 9, ల్వారెజ్ అండ్‌ మార్సల్ 7, ఆర్థర్ డీ. లిటిల్ 7 మంది ఆయా కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు.  
 
ఐటీ, ప్రొడ‌క్ట్  డొమైన్‌లో మైక్రోసాఫ్ట్ 15, ఓయో 11 ఉద్యోగాలతో పాటు మిగిలిన కంపెనీల్లో 141 మంది ఉద్యోగం పొంద‌గా అమాగి ల్యాబ్స్ 7, ఒరాకిల్ 7, అట్లాసియన్ 6, గూగుల్ 6, ఇన్ఫో ఎడ్జ్ 6, రేజర్‌పే  6కు మంది ఎంపిక‌య్యారు.   

అమెజాన్ 37, పేటీఎం 16, ఫ్లిప్‌కార్ట్ 6, మిత్రా 6తో పాటు ఇత‌ర ఈకామ‌ర్స్ కంపెనీల్లో 65 మంది ఎంపిక కాగా ఫైనాన్స్ డొమైన్‌లో 71 ఆఫర్‌లను అందుకున్నారు. గోల్డ్‌మన్ సాచ్స్  గరిష్టంగా 22 ఆఫర్ అందుకోగా అవెండస్ క్యాపిటల్ 7, సిటీ బ్యాంక్  5, డ్యుయిష్ బ్యాంక్ లో 5 మంది ఎంపికయ్యారు.

చ‌ద‌వండి: బంప‌రాఫ‌ర్!! మీ కోస‌మే..ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఊహించ‌ని శాల‌రీలు!!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top