ప్రియుడి జీతంలో 80 శాతం ఫ్యామిలీకే ఖర్చు | Earns Rs 1.2 Lakh, Sends Rs 1 Lakh To Home: Is This Financial Reality Sustainable? | Sakshi
Sakshi News home page

ప్రియుడి జీతంలో 80 శాతం ఫ్యామిలీకే ఖర్చు

Sep 23 2026 12:39 PM | Updated on Sep 23 2026 12:53 PM

Earns Rs 1.2 Lakh, Sends Rs 1 Lakh To Home: Is This Financial Reality Sustainable?

ఆధునిక సమాజంలో ఉద్యోగం, సంపాదన పెరిగినప్పటికీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత లోపించడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల రెడ్డిట్‌ వేదికగా ఒక యువతి పంచుకున్న ఆర్థిక సమస్య సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. 

ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.1.20 లక్షలు ఆర్జిస్తున్న తన ప్రియుడు అందులో రూ.1 లక్ష (ఏకంగా 83 శాతం) ప్రతి నెలా తన కుటుంబానికే పంపుతున్నాడని, చేతిలో కేవలం రూ.20,000 మాత్రమే ఉంచుకుంటున్నాడని సదరు యువతి ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో జీవిత భాగస్వాములుగా మారాలనుకునేవారికి ఈ తరహా ఆర్థిక వైఖరి ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం

సాధారణంగా వ్యక్తిగత ఆర్థిక నియమాల ప్రకారం 50/30/20 ప్రాతిపదికన రాబడిని వర్గీకరించాలి. అంటే 50% అత్యవసర ఖర్చులకు, 30% వ్యక్తిగత ఆకాంక్షలకు, కనీసం 20% పొదుపు లేదా అత్యవసర నిధికి కేటాయించాలి. అయితే, ఆదాయంలో 83 శాతాన్ని ఒకే అవసరానికి కేటాయించడం వల్ల అత్యవసర వైద్యం, ఉద్యోగ భద్రత లేకపోవడం లేదా భవిష్యత్తు నిధి నిర్మాణానికి అవకాశం ఉండదు. స్వల్ప పరిమాణంలో మిగిలే రూ.20,000తో ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో సొంత ఖర్చులు వెళ్లదీయడం కష్టం.

నెటిజన్ల స్పందన

తల్లిదండ్రులను ఆదుకోవడం సంస్కారమే అయినా పెళ్లి లేదా దీర్ఘకాలిక బంధంలోకి అడుగుపెట్టేముందు ముందస్తు ఆర్థిక ప్రణాళిక ఎంతో కీలకమని నెటిజన్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవితాన్ని పంచుకోవాలనుకునే భాగస్వామితో మాట్లాడి కుటుంబ అవసరాలకు సరిపడా బడ్జెట్‌ను పునసమీక్షించుకోవడం బంధం నిలబడటానికి, ఆర్థిక స్థిరత్వానికి అవసరమని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement