కారణం లేకుండానే ట్రంప్ పిలుస్తారు.. మస్క్ కీలక వ్యాఖ్యలు! | Donald Trump Calls Me For No Reason Says Elon Musk | Sakshi
Sakshi News home page

కారణం లేకుండానే ట్రంప్ పిలుస్తారు.. మస్క్ కీలక వ్యాఖ్యలు!

Published Fri, Jun 14 2024 9:20 AM | Last Updated on Fri, Jun 14 2024 9:34 AM

Donald Trump Calls Me For No Reason Says Elon Musk

టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల తన కంపెనీలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడారు. కారణం లేకుండానే ట్రంప్ తనను పిలుస్తూ ఉంటారని, ఎందుకు పిలుస్తారో నాకే తెలియదని అన్నారు.

డొనాల్డ్ ట్రంప్ అరిజోనాలో జరిగిన ర్యాలీలో తనను (మస్క్) ప్రశంసించారని పేర్కొన్నారు. ట్రంప్.. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కాకుండా నాకు కూడా పెద్ద అభిమాని అని చెప్పినట్లు వెల్లడించారు. సైబర్‌ట్రక్‌కి ట్రంప్ పెద్ద ఫ్యాన్ కూడా అని ఈ సందర్భంగా మస్క్ చెప్పుకొచ్చారు.

డొనాల్డ్ ట్రంప్ నన్ను పిలిచినప్పుడు చాలా బాగుంటుందని మస్క్ అన్నారు. ఈవీలు భవిష్యత్తుకు మంచివని, బ్యాటరీతో నడిచే కార్లలో అమెరికా అగ్రగామిగా ఉందని ట్రంప్ చెప్పినట్లు టెస్లా సీఈఓ వెల్లడించారు. టెస్లా కార్లను నా స్నేహితులలో కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement