బలహీనంగానే సంకేతాలు..!  | Domestic stock market weak in this week says market experts | Sakshi
Sakshi News home page

బలహీనంగానే సంకేతాలు..! 

Sep 14 2026 4:53 AM | Updated on Sep 14 2026 4:53 AM

Domestic stock market weak in this week says market experts

ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు.. ద్రవ్యోల్బణ డేటా కీలకం 

పశి్చమాసియా పరిణామాలు..క్రూడ్‌ ధరలపై కన్ను  

స్టాక్‌ మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనా 

వినాయక చవితి సందర్భంగా 

నేడు మార్కెట్లకు సెలవు.. ట్రేడింగ్‌ 4 రోజులే

ముంబై: ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బలహీనంగా కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన నిర్ణయాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అంశాలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. అలాగే పశి్చమాసియా పరిణామాలు, మండిపోతున్న ముడి చమురు ధరలు సూచీల కదలికలను శాసించవచ్చు. 

వీటితో పాటు బాండ్లపై రాబడులు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయవిక్రయాలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ వంటి అంశాలనూ మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘‘మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా, అధిక వాల్యుయేషన్లు ఉన్న రంగాల షేర్లలో పాక్షికంగా లాభాల స్వీకరణకు పాల్పడటం ఉత్తమం. అలాగే రిస్క్‌ అధికంగా ఉన్న రంగాల షేర్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలి’’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

కళ్లన్నీ ఫెడ్‌ పాలసీ వైపే.  
ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశం మంగళవారం (సెపె్టంబర్‌ 15న) ప్రారంభంకానుంది. ఫెడ్‌ చైర్మన్‌ బుధవారం రాత్రి సమావేశ నిర్ణయాలను వెల్లడి చేయనున్నారు. యూఎస్‌ ఆగస్టు ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఫెడ్‌ 25 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంపునకు మొగ్గుచూపే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనుకున్నట్లే వడ్డీ రేట్లు పెంచి, కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గుచూపుతామనే సంకేతాలిస్తే.. వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. 

దీనివల్ల డాలర్‌ బలపడి, దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించవచ్చు. అలాగే బాండ్లపై రాబడులు పెరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. అయితే, వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినా లేదా సరళతర ద్రవ్య విధాన వైఖరి సంకేతాలిచ్చినా.. అది అంతర్జాతీయ మార్కెట్లకు ఊరటనిస్తుంది. ఫెడ్‌ రిజర్వ్‌తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌లు కూడా ఇదే వారంలో తమ ద్రవ్య పాలసీ నిర్ణయాలను వెల్లడించనున్నాయి. దీంతో ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య విధానాల తీరుతెన్నులపైనే మార్కెట్‌ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. 

ద్రవ్యోల్బణంపైనే అందరి దృష్టి  
భారతీయ రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఆగస్టు నెలలో 20 నెలల గరిష్ట స్థాయికి చేరి ఉండే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని రాయిటర్స్‌ నివేదిక పేర్కొంటోంది. ఆర్‌బీఐ నిర్ధేశించిన 4 శాతం దిగువ లక్ష్యానికి మించి ద్రవ్యోల్బణం కొనసాగడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం.

 నేడు (సెప్టెంబర్‌ 14న) వెలువడనున్న దేశీయ రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.40% నుంచి 5.05% శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం పాటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ డేటా (నేడు), విదేశీ వాణిజ్య గణాంకాలు, వాణిజ్య లోటు (సెపె్టంబర్‌ 15), నిరుద్యోగిత వంటి దేశీయ స్థూల ఆర్థికాంశాలు కూడా ఈ వారం మార్కెట్‌ దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 

క్రూడ్‌ ఆయిల్‌ ధరల మంట..  
అమెరికా–ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌ 100 డాలర్ల స్థాయిని అధిగమించడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. పశి్చమాసియాలోని సముద్ర మార్గాలపై దాడులు జరగడం, తద్వారా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలతో క్రూడాయిల్‌ సూచీలు గతవారంలో ఏకంగా 8 శాతానికి పైగా లాభపడ్డాయి. భారత్‌కు అధికంగా దిగుమతయ్యే బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ ధర 104.61 డాలర్ల వద్ద స్థిరపడింది. ఎగసిపడుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను మరింత పెంచుతోంది. అలాగే, దిగుమతి బిల్లులను భారం చేసి, రూపాయి విలువను మరింత దిగజార్చి కార్పొరేట్‌ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

నిఫ్టీ సాంకేతిక స్థాయిలు 
ప్రస్తుతం నిఫ్టీకి ఎగువ స్థాయిలో 23,330 – 23,500 పరిధిలో నిరోధం ఉంది. ఒక వేళ 23,500 స్థాయిని ఛేదించగలిగితే కొనుగోళ్లు నెలకొని 23,650 స్థాయిని పరీక్షించే అవకాశం ఉంది. దిగువ స్థాయిలో 23,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. అమ్మకాలు కొనసాగి ఈ స్థాయిని కోల్పోతే ఈ ఏడాది జూన్‌ కనిష్ట స్థాయి 23,070 స్థాయికి దిగొచ్చే అవకాశం ఉంది.

ఐదో వారమూ నష్టాల పరంపర  
పశి్చమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో వారమూ నష్టాలు చవిచూసింది. గతవారం మొత్తంగా సెన్సెక్స్‌ సూచీ 1,734 పాయింట్లు (2.26%), నిఫ్టీ ఇండెక్స్‌ 500 పాయింట్లు (2%) కోల్పోయాయి. రియాల్టీ షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెల్త్‌కేర్, ఫార్మాõÙర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement