7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు | Sakshi
Sakshi News home page

7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

Published Thu, Jan 20 2022 2:15 AM

Domestic air passenger traffic rises 6. 7percent in December - Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి కోరలు చాచినా కానీ, మరోవైపు దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2021 డిసెంబర్‌లో 6.7 శాతం పెరిగింది. మొత్తం 1.12 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసినట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకటించింది. మొత్తం మీద 2021లో దేశీయ విమాన సర్వీసుల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో 6.3 కోట్ల మందితో పోలిస్తే 33 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై ఎక్కువ ప్రభావం చూపించడం తెలిసిందే.  

ఇండిగో వాటా 55 శాతం
► ఇండిగో విమానాల్లో 2021 డిసెంబర్లో 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 54.8 శాతం ఇండిగోను ఎంచుకున్నారు.
► గోఫస్ట్‌ (గతంలో గోఎయిర్‌) విమానాల్లో 11.93 లక్షల మంది ప్రయాణించారు.  
► స్పైస్‌జెట్‌ విమాన సర్వీసులను 11.51 లక్షల మంది వినియోగించుకున్నారు.  సాధారణంగా రెండో స్థానంలో ఉండే స్పైస్‌జెట్‌ మూడో స్థానానికి పడిపోయింది.
► ఎయిర్‌ ఇండియా విమానాల్లో 9.89 లక్షల మంది, విస్తారా విమాన సర్వీసుల్లో 8.61 లక్షల మంది, ఎయిరేషియా విమానాల్లో 7.01 లక్షల మంది, అలియన్స్‌ ఎయిర్‌ సర్వీసుల్లో 1.25 లక్షల మంది చొప్పున ప్రయాణించారు.  
► ఆక్యుపెన్సీ రేషియో లేదా లోడ్‌ ఫ్యాక్టర్‌ (సీట్ల భర్తీ)లో స్పైస్‌జెట్‌ మెరుగ్గా 86 శాతాన్ని డిసెంబర్‌లో నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో 80.2%, విస్తారా 78.1%, గోఫస్ట్‌ 79%, ఎయిర్‌ ఇండియా 78.2 శాతం, ఎయిరేషియా 74.2% చొప్పున ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి.
► బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి సకాలంలో సర్వీసులు నడిపించడంలో ఇండిగో 83.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది.   
► గోఫస్ట్‌ 83 శాతం, విస్తారా 81.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement