ట్విటర్‌కు సవాల్‌: టాప్‌-10 ఆల్టర్‌నేటివ్స్‌ ఇవిగో!

do you quitting twitter after blue tick feesTop10 alternatives here - Sakshi

న్యూఢిల్లీ: టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా చెప్పాలంటే, బిలియనీర్ ఎలాన్‌ మస్క్ ట్విటర్‌ డీల్‌ను చెప్పుకోవచ్చు. 44 బిలియన్ల క్యాష్ డీల్‌కు ట్విటర్‌ను టేకోవర్‌ చేశారు  మస్క్‌.  అయితే ట్విటర్‌లో చేసిన,  చేయనున్న తాజా మార్పులు, చేర్పులు చాలా మంది వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి.

ఇదీ చదవండి: అపుడు వేటు..ఇపుడు స్పెషల్‌ గిఫ్ట్: ట్విటర్‌ మాజీ ఉద్యోగి పోస్ట్‌ వైరల్‌

ముఖ్యంగా బ్లూ-టిక్ వెరిఫికేషన్‌ ఫీజు యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో ఇంకా ఏమేమి వివాదాలు, సంచలనాలు రానున్నాయోనని, అటు యూజర్లు ఇటు ప్రచురణ కర్తలు, కంటెంట్ సృష్టికర్తలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ  ట్విటర్‌డీల్‌ తరువాత  ట్విటర్‌కు పెద్ద సవాలుగా మారుతున్న టాప్‌-10 మేజర్‌ ఆల్టర్‌నేటివ్స్‌ను చూద్దాం. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ సూపర్‌ బైక్‌,సూపర్‌ ఫీచర్లతో)

ట్విటర్‌కు టాప్‌- 10 మేజర్‌ ఆల్టర్‌నేటివ్‌  ప్లాట్‌ఫారమ్స్‌
బ్లూ స్కై: ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సే స్థాపించిన బ్లూస్కీ యాప్. ఈ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు అక్టోబర్ ప్రకటించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌కు ఇప్పటికే 30వేల మంది సైన్ అప్ చేసి వెయిట్‌ చేస్తున్నారు. తమ ప్రచురించిన కంటెంట్‌పై హక్కు, పోస్ట్‌లను వివిధ సోషల్ నెట్‌వర్క్‌లలో తరలించేందుకు ఇది వీలు కల్పిస్తుందట.  

కూ: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న దేశీయ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ. ఇది 200 దేశాల్లో 50 మిలియన్లకు పైగా వినియోగదారులతో ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉంది. తమకిష్టమైన భాషలో వ్యక్తీకరించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సామాజిక వార్తలు, కొత్త అప్‌డేట్స్‌ను, ట్రెండింగ్ పోస్ట్‌లు చూడొచ్చు. మిలియన్ల కొద్దీ క్రియేటర్‌లు, సెలబ్రిటీలు లేదా టాపిక్‌లను కూ యూజర్లు ఫాలో అవ్వొచ్చు. ఇండియాలో చాలా ప్రభుత్వ శాఖలు, అధికారులు కూయూజర్లుగా ఉన్నారు. ఇటీవల వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా  బెనర్జీ కూడా  కూ యాప్‌లో చేరారు. 

మాస్టోడాన్ : దాదాపు ట్విటర్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్. ఇన్‌స్టాన్స్  అనే మాస్టోడాన్ నోడ్‌ల ద్వారా అందించే మైక్రోబ్లాగింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో కూడా యాడ్స్‌ ఉండవు.ప్రవర్తనా నియమావళి, సేవా నిబంధనలు, సెక్యూరిటీ ఆప్షన్స్‌, నియంత్రణ విధానాలు ఇందులో ఉన్నాయి. అలాగే 500 అక్షరాల లిమిట్‌, ఎమోజీలకు సపోర్ట్‌ చేస్తుంది. 10 లక్షలకుపైగా  యాక్టివ్‌  యూజర్లు దీని సొంతం. ముఖ్యంగా అక్టోబర్ నెలలో  మస్క్‌- ట్విటర్‌ టేకోవర్‌ తరువాత  దాదాపు 500,000 మంది కొత్త వినియోగదారులను  తన ఖాతాలో వేసుకుంది.

టంబ్లర్: 2007లో లాంచ్‌ అయిన సోషల్ మీడియా వెబ్‌సైట్ టంబ్లర్‌. ఇందులో ఫోటోలు, GIFల లాంటి  వాటితోపాటు, లాంగ్‌ పోస్ట్‌లు కూడా  చేసుకోవచ్చు. మల్టీమీడియా, ఇతర కంటెంట్‌ను బ్లాగ్‌లో పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇతరుల బ్లాగ్‌లనూ  ఫాలోకావచ్చు. డైరెక్ట్‌ మెసేజ్‌ ద్వారా చాటింగ్‌ చేసుకోవచ్చు.

 

క్లబ్‌హౌస్: కోవిడ్‌ కాలంలో పాపులర్‌ అయింది. క్లబ్‌హౌస్. క్లబ్‌హౌస్ లైవ్ ఆడియో చాట్‌రూమ్‌లలకు అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో చాట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులోని రూమ్స్‌ ద్వారా ఒక వినియోగదారు ఆడియో చాట్‌రూమ్‌ని ప్రారంభించవచ్చు. ఏ అంశంపైనైనా చర్చించవచ్చు. ఇన్వైట్ ఆప్షన్‌ ద్వారా ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ పొందే వీలుంది.

కోహోస్ట్: ఎలాంటి యాడ్స్‌ లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోహోస్ట్. ఇందులో పోస్ట్‌లు ట్విటర్‌ లాగానే మన టైమ్‌లైన్‌లో వరుసగా ఉంటాయి. కోహోస్ట్ సబ్‌స్క్రిప్షన్స్‌ మొదలు పెడతామని కంపెనీ ఇటీవల ప్రకటించింది. 

పార్లర్: నాష్‌విల్లే బేస్ట్‌డ్‌ పార్లర్‌ 2018లో ఆవిష్కృతమైంది. అమెరికాలో కన్సర్వేటివ్‌ ఫావేరెట్‌గా పాపులర్‌ అయింది. కంటెంట్ మోడరేషన్‌కు ప్రాధాన్యమిచ్చే పార్లర్‌..వినియోగదారులు పోస్ట్‌లపై జోక్యం చేసుకోదు. అలాగే ఫేస్‌బుక్‌, ట్విటర్‌  వ్యతిరేకించే వారిలో ఎక్కువ ఆదరణ పొందింది. 

ట్రైబల్‌ సోషల్‌: ఇది యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో, ఆండ్రాయిడ్‌లో ఇది అందుబాటులో ఉంది. యూజర్లు వివిధ ట్రెండింగ్ అంశాలపై నిపుణులను  ఇక్కడ కనుగొనవచ్చు. ట్రైబెల్ యూజర్‌ పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లువచ్చాయో ట్రాక్ చేసి,  జనాదరణ పొందిన పోస్ట్‌లు ,కంట్రిబ్యూటర్‌లను ర్యాంక్‌లిస్తుంది.  

ట్రూత్ సోషల్: అమెరికా  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎంతో ఇష్టమైన ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్.ఒక అమెరికన్‌ స్థాపించిన ఇది అమెరికా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 

యూసింక్‌: ఈ ప్లాట్‌ఫారంలో స్టోరీలు, వీడియోలు, ఫోటోలతోపాటు, బ్లాగ్‌లోలా లాంగ్‌ కంటెంట్‌ను పోస్ట్ చేయవచ్చు. ఈవెంట్‌లను కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇది యూజర్లనుంచి ఫీజు వసూలు చేస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top