అపుడు వేటు..ఇపుడు స్పెషల్‌ గిఫ్ట్: ట్విటర్‌ మాజీ ఉద్యోగి పోస్ట్‌ వైరల్‌

Twitter exemployee receives special Gift days after being fired Details inside - Sakshi

న్యూఢిల్లీ: 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలుచేసిన తరువాత టెస్లా  చీఫ్‌  ఎలాన్‌ మస్క్‌ పలు కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా అప్పటి సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా, పలువురి కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు. అంతేకాదు నిర్దాక్షిణ్యంగా అనేకమంది సీనియర్‌ ఉద్యోగులతో పాటు, దాదాపు 50 శాతం మందిని తొలగించారు. అయితే ఆశ్చర్యకరమైన ఉదంతం  ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి  సంబంధించి  మాజీ మహిళా ఉద్యోగి పోస్ట్‌ ఒకటి  వైరల్‌ గామారింది. (ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్‌?)

తొలగించిన ఉద్యోగుల్లో ఒకరైన  ట్విటర్‌ సీనియర్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఎలైన్ ఫిలాడెల్ఫో  ట్విటర్‌ నుంచి  పదేళ్ల వార్షికోత్సవ  అభినందలు, బహుమతిని తాజాగా  అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. "ఈరోజు స్పెషల్‌ డెలివరీ వచ్చింది!!" పదేళ్ల వార్షికోత్సవ అభినందన సందేశంతో ట్విటర్ పార్శిల్ వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. 

ఇప్పటికే ట్విటర్‌లో ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగులు తమ భావోద్వేగాలను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు.ఎలైన్ కూడా వరుస ట్విట్లలో తనను తొలగించడంపై బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ఎరా ముగిసింది. పదేళ్ల సేవల తరువాత దుర్మార్గంగా తొలగించారంటూ ఆవేదన వెలిబుచ్చారు. అలాగే తన తోటి ఉద్యోగులకు మద్దతు తెలిపారు.

ఇదీ చదవండి: Snapchat కొత్త ఫీచర్‌: వారికి గుడ్‌ న్యూస్‌, నెలకు రూ. 2 లక్షలు

కాగా ట్విటర్ పగ్గాలు చేపట్టిన తర్వాత, మస్క్ గత వారం ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తొలగించారు.  ఈ చర్య చట్టాల ఉల్లంఘన, అమానవీయమంటూ ప్రపంచవ్యాప్తంగా మస్క్‌పై  విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top