హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి.. | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..

Published Sun, May 26 2024 4:09 PM

Divi's Laboratories Founder's Daughter Buys 2 Luxury Properties In Hyderabad

హైదరాబాద్‌ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్‌లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.

జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్‌కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.

సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలకు హైదరాబాద్‌ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్‌ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement