యాపిల్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌!

Did You Know What Is Apple's Latest Update In Iphone - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారీ కీలక నిర్ణయం తీసుకుంది. లాభాల్ని గడించేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్‌ తన ఐఫోన్‌ ఇంటర్‌ ఫేస్‌పై అనవరసరమైన బ్లోట్‌ వేటర్‌ అనే థర్డ్‌ పార్టీ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పాడ్‌ కాస్ట్‌, మ్యాప్స్‌,న్యూస్‌,మ్యూజిక్‌, మెజేస్‌లు యాపిల్‌ యాప్స్‌తో రానున్నాయి. అవసరం అయితే యూజర్లు వాటిని డిలీట్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు రెవెన్యూ కోసం సీఈవో టిమ్‌ కుక్‌ కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

బ్లూమ్‌ బర్గ్‌ కథనం ప్రకారం.. ఐఫోన్‌లపై కనిపించే యాప్స్‌లో యాపిల్‌  యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. ఇప్పటికే యాపిల్‌ యాపిల్‌ స్టోర్‌, ఇన్‌ హౌస్‌ న్యూస్‌, స్టాక్స్‌ యాప్‌పై యాడ్స్‌ ప్లే చేస్తుంది. థర్డ్‌ పార్టీ డెవలపర్ల సాయంతో ఆ సాఫ్ట్‌వేర్లను ప్రమోట్‌ చేస్తున్నట్లు హైలెట్‌ చేసింది. 

వరల్డ్‌ వైడ్‌గా ఐఫోన్‌, మాక్స్‌, ఐపాడ్‌, యాపిల్‌ మ్యాప్స్‌,పాడ్‌ క్యాస్ట్‌లపై యాడ్స్‌ను ప్రమోట్‌ చేయడం, అదే సమయంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా యాడ్స్‌ వ్యాల్యూమ్‌ను పెంచనున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ అనలిస్ట్‌ మార్గ్‌ గుర్మాన్‌ వెల్లడించారు. అయితే ఇతర యాండ్రాయిడ్‌ యాప్స్‌లాగా ఐఫోన్‌ స్పామీ నోటిఫికేషన్‌లు మాత్రం ఇవ్వదని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ యాడ్‌-సపోర్టెడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తరహాలో యాపిల్‌ టీవీ ప్లస్‌ టైర్‌లో అదే తరహా యాడ్స్‌ సపోర్టెడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను అమలు చేయనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top