ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్.. ధర రూ.40 వేలు మాత్రమే

Detel Easy Plus electric bike launched at RS 39999 - Sakshi

రోజు రోజుకి ఎలక్ట్రిక్ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగి పోతుంది. వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనం విడుదల అవుతుంది. మరో భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ డెటెల్ "ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్"ను లాంచ్ చేసింది. ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌ ధర రూ.41,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈజీ ప్లస్‌ను రూ.1,999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. డిటెల్ ఈజీ ప్లస్ 20ఆంపియర్, 250వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 100 శాతం ఛార్జ్ కావడానికి 4నుంచి 5 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్ ద్వారా ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని డిటెల్ పేర్కొంది. 

ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ 25 కి.మీ. డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లో పౌడర్-కోటెడ్, మెటల్ అల్లాయ్ బాడీ ఉంది. దీనిని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.  ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్యూబ్ లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్స్, పెడల్స్ వంటి లక్షణాలతో వస్తుంది. ఈజీ ప్లస్ 170 కిలోల వరకు బరువును మోయగలదు. 40,000 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను కూడా అందిస్తున్నారు. కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే.. వినియోగదారులు మెటాలిక్ ఎల్లో, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లాక్, గన్మెటల్, పెర్ల్ వైట్ రంగులను ఎంచుకోవచ్చు. ఇది 170 మీ.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కూడా కలిగి ఉంది.(చదవండి: క్వాడ్ కెమెరా సెటప్‌తో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌...!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top