కొత్త వార్షిక సమాచార ప్రకటన ఇలా.. | Sakshi
Sakshi News home page

కొత్త వార్షిక సమాచార ప్రకటన ఇలా..

Published Mon, Nov 22 2021 8:25 AM

Details The new IT Annual Information Statement - Sakshi

The new IT Annual Information Statement Form 26 A: ఇటీవల ఆదాయపు పన్ను శాఖ సరికొత్త ‘‘వార్షిక సమాచార ప్రకటన’’ వివరాలను విడుదల చేశారు. దీన్నే ఫారం 26 అ  అని అంటారు. ఇక నుంచి ఈ ఫారంలో అనేక విషయాలు పొందుపరుస్తున్నారు. ఇకపై ఇందులో కనబడే 50 అంశాలను కింద తెలియజేస్తున్నాము.. 
- జీతభత్యాలు, వేతనాలు, అలవెన్సులు మొదలైనవి 
- మీరు అద్దెకు ఇచ్చిన ఇళ్ల మీద మీకు వచ్చే అద్దె వివరాలు 
- అందుకున్న డివిడెండ్లు  
- బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో జమయ్యే వడ్డీ 
- ఫిక్సిడ్‌ డిపాజిట్ల మీద వడ్డీ 
- ఇతరత్రా వచ్చే వడ్డీల వివరాలు 
- ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చే రిఫండు మీద వడ్డీ (రిఫండు ఆదాయం కాదు, కాని వడ్డీ మాత్రం ఆదాయం) 
 - ప్లాంటు, మెషినరీ మొదలైనవి అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం 
- లాటరీ / క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ మీద వచ్చే ఆదాయం 
- గుర్రపు పందాల మీద ఆదాయం 
- ప్రావిడెంట్‌ ఫండ్‌లో జమ అయ్యే దానిలో యజమాని ఇచ్చిన మొత్తం 
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్‌ మీద వడ్డీ 
- నాన్‌ రెసిడెంట్లకు వచ్చిన వడ్డీ (115 అ (1) (్చ) (జీజ్చీ్చ) 
- గవర్నమెంటు సెక్యూరిటీల మీద, బాండ్ల మీద వడ్డీ 
- 13లో చెప్పిన ప్రకారం యూనిట్‌ మీద ఆదాయం 
- 115  అఆ (1) (b) ప్రకారం యూనిట్‌ మీద వచ్చే ఆదాయం, క్యాపిటల్‌ గెయిన్స్‌ 
- 115  అఇ ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్ల మీద, షేర్ల మీద ఆదాయం 
- 115  అఈ (1) (జీ) ప్రకారం విదేశీ సంస్థల నుంచి ఆదాయం 
- ఇన్సూరెన్స్‌ కమీషన్‌ 
- కొన్ని నిబంధనలకు లోబడి ఇన్సూరెన్స్‌ పాలసీల మీద వచ్చే మొత్తం 
- ఎన్‌ఎస్‌సీ నుంచి విత్‌డ్రాయల్స్‌ 
 - లాటరీ టికెట్లు విక్రయించినందుకు వచ్చే కమీషన్‌ 
- సెక్యూరిటైజేషన్‌ ట్రస్ట్‌ నుండి ఆదాయం 
-  యూనిట్ల కొనుగోలు మీద ఆదాయం 
- గవర్నమెంటుకు ఇవ్వాల్సిన వడ్డీ 
- నాన్‌ రెసిడెంట్‌ స్పోర్ట్స్‌మెన్‌కి చెల్లింపులు 
- స్థిరాస్తి – భూమి, బిల్డింగ్‌ల విక్రయాలు 
- స్థిరాస్తుల బదిలీల వల్ల వచ్చే మొత్తం 
- వాహనాల అమ్మకాలు 
- మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల అమ్మకాలు 
- ఆఫ్‌ మార్కెట్‌ డెబిట్లు 
- ఆఫ్‌ మార్కెట్‌ క్రెడిట్లు 
- వ్యాపారంలో వసూళ్లు 
- వ్యాపారంలోని ఖర్చులు 
- మీరు చేసిన అద్దె చెల్లింపులు 
- 16డి ద్వారా ఇతర చెల్లింపులు 
- బ్యాంకు అకౌంటులో నగదు జమలు 
- బ్యాంకు అకౌంటు నుంచి విత్‌డ్రాయల్స్‌ 
- నగదు చెల్లింపులు 
- విదేశాలకు పంపిన మొత్తం, కరెన్సీల కొనుగోలు 
- విదేశాల నుంచి వచ్చిన మొత్తం 
- విదేశీయానం వివరాలు 
- స్థిరాస్తుల కొనుగోళ్ల వివరాలు 
- వాహనాల కొనుగోళ్లు 
- టైం డిపాజిట్ల కొనుగోళ్లు 
- సెక్యూరిటీలు, యూనిట్ల కొనుగోళ్లు 
- డెబిట్‌ / క్రెడిట్‌ కార్డుల వ్యవహారాలు 
- బ్యాంకు అకౌంటు వివరాలు 
- వ్యాపార ట్రస్టులు ఇచ్చిన ఆదాయం 
- ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ల మీద ఆదాయం 
ఇంచు మించు ప్రతి విషయం మీద ఆరా తీసి సమాచారం సేకరిస్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. పారదర్శకతే మీకు శ్రీరామరక్ష. 



కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి , కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)
 

చదవండి: విదేశాల్లో ఉన్నారు.. ఇన్‌కంట్యాక్స్‌ ఫైల్‌ చేయడం ఎలా?

Advertisement
Advertisement