ఎయిర్‌టెల్‌ స్టార్టప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌

Details About Airtel Startup Innovation Challenge - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ స్టార్టప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ ప్రకటించింది. ఇన్వెస్ట్‌ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, క్లౌడ్‌ కమ్యూనికేషన్స్, డిజిటల్‌ అడ్వర్టైజింగ్, డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాల్లో విభిన్న పరిష్కారాలను ప్రదర్శించడానికి తొలి దశ సాంకేతిక కంపెనీలను ఆహ్వానిస్తారు.

విజేతలుగా నిలిచిన టాప్‌–10 కంపెనీలకు నగదు బహుమతులు, ఎయిర్‌టెల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఔత్సాహిక స్టార్టప్స్‌ జనవరి 24లోగా దరఖాస్తు చేసుకోవాలి.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top