
వాతావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ప్రతీ అవకాశం వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా మరోసారి ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యక్తిగత, రవాణా, కార్గోలలో ఏ తరహా ద్విచక్ర వాహనమైనా సరే, ఈవీ అయితే చాలు ప్రోత్సాహం అందిస్తామని తెలిపింది.
ఢిల్లీలోని ఆప్ సర్కారు ప్రకటించిన రాయితీల ప్రకారం.. ఢిల్లీలో రిజిస్ట్రర్ అయ్యే మొదటి పది వేల ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలకు ఈ ఇన్సెంటీవ్ వర్తిస్తుంది. ఇందులో ఒక్కో వాహనంపై గరిష్టంగా రూ.5,500ల వరకు ప్రోత్సాహంగా అందివ్వనుంది. కార్గో, పర్సనల్, వ్యక్తిగత అన్ని కేటగిరీల వాహనాలకు ఇందులో చేర్చారు. దీనికి అదనంగా మొదటి వెయ్యి వ్యక్తిగత వాహనాలకు అదనంగా మరో రూ.2000లు ప్రోత్సాహక నగదు అందివ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.