దేశంలో జోరుగా స్టార్టప్ కల్చర్.. ప్రపంచంలోనే 3వ స్థానంలో!

Delhi With 5,000 Startups Replaces Bengaluru As Startup Capital of India - Sakshi

దేశంలో రోజు రోజుకి స్టార్టప్ కల్చర్ భారీగా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వందలాది కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ(గతంలో బెంగళూరు) భారత స్టార్ట్-అప్ రాజధానిగా మారింది. ఏప్రిల్ 2019 - డిసెంబర్ 2021 మధ్య కాలంలో బెంగళూరులో ఏర్పడిన 4,514 స్టార్టప్ కంపెనీలతో పోలిస్తే ఢిల్లీలో 5,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీలు వెలిసినట్లు నేడు పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22లో తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో(11,308) స్టార్ట్-అప్ కంపెనీలు ఉన్నాయి. 

జనవరి 10, 2022 నాటికి భారతదేశంలో 61,400కు పైగా స్టార్ట్-అప్ కంపెనీలను గుర్తించినట్లు ఈ నివేదిక తెలిపింది. 2021లో 44 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. దీంతో, అమెరికా & చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో యునికార్న్ సంస్థలు భారతదేశంలోనే ఉన్నాయి. 2021లో అమెరికాలో 487 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందితే, చైనాలో 301 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. జనవరి 14, 2022 నాటికి, భారతదేశంలోని మొత్తం 83 యునికార్న్ కంపెనీల సంపద విలువ 277.77 బిలియన్ డాలర్లు. ఈ స్టార్ట్-అప్ కంపెనీలలో చాలా వరకు కంపెనీలు సేవ రంగంలో ఉన్నాయి. 

అలాగే, దేశంలోని స్టార్ట్-అప్ కంపెనీలలో ఎక్కువ భాగం ఐటీ/నాలెడ్జ్ ఆధారిత రంగంలో ఉన్నాయి. 2016-17లో 733 స్టార్ట్-అప్ కంపెనీల నుంచి కొత్తగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2021-22 నాటికి 14,000కు చేరుకుంది. గత మూడు సంవత్సరాలుగా, అంతరిక్ష రంగంలో స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2019లో ఉన్న 11 నుంచి 2021 నాటికి 42కు పెరిగింది. ఇస్రో/డివోఎస్ ఎలాంటి స్టార్ట్-అప్ కంపెనీలను నమోదు చేయనందున, స్టార్టప్ ఇండియా పోర్టల్లో స్పేస్ టెక్నాలజీ కేటగిరీ కింద సుమారు 75 స్టార్ట్-అప్ కంపెనీలు మాత్రమే చూపిస్తున్నాయి. 2021లో 555 జిల్లాలు కనీసం ఒక కొత్త స్టార్ట్-అప్ కంపెనీ వెలిసింది. 2016-17లో 121 జిల్లాలో మాత్రమే ఒక స్టార్ట్-అప్ కంపెనీ స్థాపించబడింది.

(చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top