బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు!

Gold Prices Dip By Rs 130 On January 31, 2022 - Sakshi

మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేవలం వారం రోజుల్లోనే సుమారు రూ.800కి పైగా తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి(999 స్వచ్చత) బంగారం ధర రూ.130కి పైగా తగ్గి రూ.48048 వద్ద నిలిచింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,012గా ఉంది. 

మన హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పడిపోయాయి. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే 999 స్వచ్చత గల బంగారం ధర రూ.49,100 నుంచి రూ.48,990కి పడిపోయింది. అంటే, ఒక్కరోజులో రూ.110కి పైగా తగ్గింది అన్నమాట. ఇక 916 స్వచ్చత గల పసిడి ధర రూ.100 తగ్గి రూ.44,900కి చేరుకుంది. బంగారంతో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఒక కేజీ వెండి ధర రూ.800కి పైగా తగ్గి రూ.60,898కు పడిపోయింది. విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

(చదవండి: ఇకపై అన్నింటికీ ఒకే కార్డు..! కేంద్రం కీలక నిర్ణయం..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top