డీమార్ట్‌ లాభం అప్‌ క్యూ3లో రూ. 690 కోట్లు | Sakshi
Sakshi News home page

డీమార్ట్‌ లాభం అప్‌ క్యూ3లో రూ. 690 కోట్లు

Published Mon, Jan 15 2024 1:03 AM

D-Mart net profit rises 17percent to Rs 690 crore, revenue up 17. 3percent - Sakshi

న్యూఢిల్లీ: డీమార్ట్‌ స్టోర్ల రిటైల్‌ చైన్‌ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో నికర లాభం 17 శాతం బలపడి రూ. 690 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 590 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతంపైగా పుంజుకుని రూ. 13,572 కోట్లను అధిగమించింది.

గత క్యూ3లో రూ. 11,569 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 12,656 కోట్లను తాకాయి. డిసెంబర్‌ చివరికల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 341కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. హరీష్‌చంద్ర ఎం.భారుకాను స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement