గెట్ రెడీ ఫర్.. సైబర్‌పంక్ 2077

Cyberpunk 2077 Is Most Likely India Biggest PC Game - Sakshi

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్‌పంక్ 2077 గేమ్ డిసెంబర్ 10 విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ గేమ్ విడుదల అనేది మీరు నివసించే ప్రాంతం, మీరు ఆడే ప్లాట్‌ఫామ్ బట్టి‌ మార్పు ఉంటుంది. ఇంతక ముందు తెలిపిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఊహించిన దాని కంటే ముందే ఆడవచ్చు. ఈ గేమ్ అన్ని దేశాల కంటే ముందు లాస్ ఏంజెల్స్ లో డిసెంబర్ 9 సాయంత్రం గంటలకు విడుదల అవ్వగా. చివరగా న్యూజిలాండ్ రాజదాని వెల్లింగ్టన్ లో డిసెంబర్ 10 మధ్యాహ్నం 1కి విడుదల అవుతుంది. వచ్చే వారం విడుదల అయ్యే సైబర్‌పంక్ 2077 మీ పిసిలో డిసెంబర్ 7 నుండి ఆటను ప్రీలోడ్ చేసుకోవచ్చు. ప్రీలోడ్‌లు జీఓజిలో 12పీఎం వద్ద మరియు ఎపిక్ గేమ్స్ స్టోర్‌లో 5పీఎం వద్ద ప్రారంభమవుతాయి. ఎక్స్ బాక్స్ వన్, ఎక్స్ బాక్స్ సిరీస్ కన్సోల్‌లలో ఇప్పటికే ఆటను ప్రీలోడ్ చేయవచ్చు. ప్లేస్టేషన్ 4 మరియు ప్లేస్టేషన్ 5లలో ప్రీలోడ్‌లు “విడుదల తేదీకి రెండు రోజుల ముందు” ప్రారంభమవుతాయి. (చదవండి: గూగుల్ మాప్స్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌)

విడుడలకు సిద్ధంగా ఉన్న సైబర్‌పంక్ 2077 గేమ్ ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ గేమ్ మన దేశంలో కూడా మరింత ఆసక్తి రేపుతోంది. గేమింగ్ లవర్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సైబర్‌పంక్ 2077 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన పిసి గేమ్‌గా నిలిచింది అని అంచనా. సైబర్‌పంక్ 2077 ఇప్పటికే జీవితకాల అమ్మకాలలో విట్చర్ 3 గేమ్ ను దాటిందని డెవలపర్ ఇంతకుముందే ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు, విట్చర్ 3 చాలా ప్రజాదరణ పొందిన గేమ్. భారతదేశంలో ఇంతకుముందు పిసి గేమింగ్ అనేది అత్యంత ఖరీదైన భావించేవారు. "సైబర్‌పంక్ 2077 భారతదేశంలో అని కన్సోల్ వెర్షన్ల కంటే పిసి గేమ్ ని ఆరు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ అమ్ముతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న బహుళ రిటైలర్లు" తెలిపారని సంస్థ పేర్కొంది. కన్సోల్ వెర్షన్లతో పోల్చితే రిటైల్ ధర తక్కువగా ఉండటంతో పాటు డెస్క్‌టాప్ పిసిలకు డిమాండ్ పెరగడం ఈ పిసి గేమ్ సేల్ స్పైక్‌కు కారణమని నిపుణుడు అల్వానీ పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top