గూగుల్ మాప్స్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌

Google Maps Getting Ride Services in Menu - Sakshi

గూగుల్ మ్యాప్స్ స‌రికొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది. తాజా బీటా నివేదిక ప్రకారం, గూగుల్ మ్యాప్స్ లో 'రైడ్ సర్వీసెస్' అనే కొత్త సర్వీస్ ని తీసుకోరాబోతుంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని పంపడం ద్వారా మరింత ఖచ్చితమైన ఛార్జీలను తెలుసుకోవ‌డానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ 'రైడ్ సర్వీసెస్'  సెట్టింగ్‌ అనేది ఉబెర్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ సర్వీసులు అనేవి వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా బీటా వెర్షన్ లో బిల్డింగ్ నంబర్లు మరియు క్రాస్‌వాక్ గుర్తులను జోడించినట్లు నివేదిక పేర్కొంది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలో మరిన్నీ నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం. న్యూయార్క్ వంటి నగరాల్లోని వీధుల్లో మ్యాప్ లను జూమ్ చేయడం ద్వారా మీరు భవనాల సంఖ్యలను మరియు క్రాస్‌వాక్ గుర్తులను గుర్తించవచ్చని నివేదికలోని స్క్రీన్‌షాట్‌లలో తెలుస్తుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ లో మరో కొత్త సేల్)

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top