రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా | crisp summary of JLL India latest real estate insights for H1 2025 | Sakshi
Sakshi News home page

రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా

Jul 23 2025 8:45 AM | Updated on Jul 23 2025 8:45 AM

crisp summary of JLL India latest real estate insights for H1 2025

జనవరి–జూన్‌ మధ్యకాలంలో 32 శాతం డౌన్‌

ప్రీమియం ఇళ్లకు మంచి డిమాండ్‌

6 శాతం అధిక విక్రయాలు

జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో రూ.కోటిలోపు ధర కలిగిన అపార్ట్‌మెంట్ల (ఫ్లాట్లు) అమ్మకాలు 32 శాతం తగ్గిపోయాయి. ఇదే కాలంలో ప్రీమియం అపార్ట్‌మెంట్లలో అమ్మకాలు 5 శాతం పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్‌ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 1,34,776 అపార్ట్‌మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గాయి.

రూ.కోటి ధరలోపు అపార్ట్‌మెంట్ల విక్రయాలు మాత్రం 32 శాతం తగ్గి 51,804 యూనిట్లుగా ఉన్నాయి. రూ.కోటికి పైన ధర శ్రేణిలోని అపార్ట్‌మెంట్ల అమ్మకాలు 6 శాతం పెరిగి 82,972 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో అమ్మకాలపై జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక విడుదల చేసింది. అపార్ట్‌మెంట్ల గణాంకాలు మినహా విల్లాలు, రోహౌస్‌లు ఇతర ఇళ్ల విక్రయాలు ఇందులో లేవు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం అపార్ట్‌మెంట్ల అమ్మకాల్లో రూ.కోటికి పైన ధరలోనివి (ప్రీమియం) 62 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు మొత్తం విక్రయాల్లో 51 శాతంగా ఉన్నాయి. రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాల వాటా 49 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువ

పెరుగుతున్న కొనుగోలు సామర్థ్యం..  

‘లగ్జరీ ఇళ్ల అమ్మకాలు స్థిరంగా వృద్ధి చెందడం కొనుగోలు పెరుగుతున్న సామర్థ్యం, మెరుగైన జీవన ఆకాంక్షలకు నిదర్శనం. ప్రీమియం ప్రాపర్టీల పట్ల పెరుగుతున్న దృష్టి మాస్‌ హౌసింగ్‌ విభాగంలో కార్యకలాపాలకు ప్రాధాన్యం తగ్గుతోంది’ అని జేఎల్‌ఎల్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సమంతక్‌ దాస్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement