వరల్డ్‌ కప్‌ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!

Cricket World Cup Vodafone Idea offers Disney Hotstar additional data discounts - Sakshi

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్‌లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్‌లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్‌లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్‌ ఐడియా (Vi) యాప్‌లో అందుబాటులో ఉంటాయి . 

డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్‌
రూ. 839 హీరో అన్‌లిమిటెడ్ ప్యాక్‌తోపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్‌ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది.

డబుల్ డేటా
ఆఫర్‌లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్‌పై డబుల్ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది.

ఇక రూ. 418 డేటా ప్యాక్‌పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు.

వీఐ యాప్‌లో కూపన్ కోడ్‌ల ద్వారా, వెబ్ పోర్టల్‌లో ఫ్యాన్‌కోడ్‌ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్‌లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్‌పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. 

కాగా ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్‌ కప్‌ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్‌లు,  ప్లాన్‌లను ప్రారంభించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top