Consumer Electronics Firm BoAt Earns Rs 4000 Crore In Sales In FY23 - Sakshi
Sakshi News home page

బోట్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల అమ్మకాలు అదరహో.. రూ.4,000 కోట్ల టర్నోవర్‌

Jun 19 2023 9:32 AM | Updated on Jun 19 2023 12:56 PM

Consumer electronics firm boAt earns Rs 4000 Crore in sales in FY23 - Sakshi

న్యూఢిల్లీ: ఆడియో, వేరబుల్స్‌ బ్రాండ్‌ బోట్‌ 2022–23లో రూ.4,000 కోట్ల నికర అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ‘కొన్నేళ్లుగా స్థానిక భారతీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాం. ఆడియో, వేరబుల్స్‌ ఉత్పత్తులను డిక్సన్‌తో సహా అనేక కంపెనీలు దేశీయంగా తయారు చేస్తున్నాయి. డిక్సన్‌తో జేవీ కూడా ఏర్పాటు చేశాం’ అని బోట్‌ తెలిపింది. 

గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 2,870 కోట్ల అమ్మకాలతో  పోలిస్తే ఇది దాదాపు 40 శాతం పెరిగింది. సొంత ఆర్‌ అండ్‌ డీ సదుపాయం, బోట్ ల్యాబ్స్‌ను గతేడాదే కంపెనీ ఏర్పాటు చేసింది. గత సంవత్సరం కొలుగోలు చేసిన సింగపూర్‌కు చెందిన సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్ ‘కాహా’ సహకారంతో స్మార్ట్, హోలిస్టిక్ వెల్‌నెస్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement