‘మస్క్‌ తప్పు చేశావ్‌..ఇప్పటికైనా అర్థమవుతోందా?’

Committed Evil By Stopping Attack On Russia Claims Ukrainian Official on elon musk - Sakshi

ప్రపంచకుబేరుడు, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌పై ఉక్రెయిన్  మండిపడుతోంది. గత ఏడాది రష్యా యుద్ధనౌకలపై డ్రోన్ దాడిని నిరోధించేందుకు తన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ని ఉపయోగించడానికి అనుమతిని ఎలా నిరాకరించారనే వివరాలు కొత్త జీవిత చరిత్రలో వెల్లడైన నేపథ్యంలో ఉక్రేనియన్ సీనియర్ అధికారి ఎక్స​(ట్విటర్‌)లో స్పందించారు.  మస్క్‌  చాలా పాపానికి పాల్పడ్డాడంటూ ఆగ్రహం  వ్యక్తం చేసింది. 

ఉక్రేనియన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ మస్క్‌ జోక్యం తీరని నష్టానికి, అనేకమంది పౌరుల మరణాలకు దారితీసిందని ఆరోపించారు.  ఒకోసారి పొరపాటు తీవ్ర తప్పిదంగా మారుతుంది. ఇది అజ్ఞానం, అహం కలయిక ఫలితం. స్టార్‌లింక్ జోక్యం ద్వారా రష్యన్ నౌకాదళంలో కొంత భాగాన్ని నాశనం చేయడానికి ఉక్రేనియన్ డ్రోన్‌లను అనుమతించి, రష్యా నౌకాదళాన్ని ఉక్రేనియన్ నగరాలపై కాలిబర్ క్షిపణుల దాడికి అనుమతించింది. ఫలితంగా,  అనేకమంది పిల్లలు, పౌరులను పొట్టన పెట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. (వరల్డ్‌ రిచెస్ట్‌ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు)

అసలు కొంతమంది యుద్ధ నేరస్థులను, హత్య చేయాలనే వారి కోరికను ఎందుకు రక్షించాలనుకుంటున్నారు. తద్వారా వారు పాపానికి ఒడిగడుతున్నారని , దాన్ని ప్రోత్సహిస్తున్నారని  ఇప్పటికైనా గ్రహించారా? అని ప్రశ్నించారు. టెక్ బిలియనీర్‌  మస్క్‌ జీవిత చరిత్రలోని దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మైఖైలో పోడోల్యాక్ ప్రకటన వచ్చింది.

కాగా బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్‌ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్‌ బయోగ్రఫీ సీఎన్‌ఎన్‌ ప్రచురించిన పుస్తకంలో సాయుధ జలాంతర్గామి డ్రోన్లు "కనెక్టివిటీని కోల్పోయినప్పుడు , ప్రమాదకరం లేకుండా ఒడ్డుకు కొట్టుకుపోయినప్పుడు" క్రిమియా తీరానికి సమీపంలో ఉన్న రష్యన్ నౌకాదళాన్ని ఎలా సమీపిస్తున్నాయో వివరించింది.రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రేనియన్ దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తాడనే ఆందోళన కారణంగా దాడి జరిగిన ప్రాంతంలో సేవలను నిలిపి వేయమని  మస్క్ స్టార్‌లింక్ ఇంజనీర్‌లను ఆదేశించారని ఈ పుస్తకంలో  పేర్కొన్నారు.

మరోవైపు స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను ఆపివేసినట్లు వచ్చిన ఆరోపణలను మస్క్ ఖండించారు. రష్యా -ఉక్రెయిన్‌ వార్‌కి మరింత ఆజ్యం పోయకూడదనే ఉద్దేశంతోనే నో చెప్పా నన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుండి క్రిమియన్ నౌకాశ్రయ నగరమైన సెవాస్టోపోల్ వరకు సక్రియం చేయమని చేసిన అభ్యర్థనకు తాను అంగీకరించ లేదని వివరణ ఇచ్చాడు.  తన స్పేస్‌ఎక్స్ కంపెనీ "యుద్ధం-సంఘర్షణ తీవ్రతరం చేసే చర్యలకు సహకరించడం" తనకు ఇష్టం లేదంటూ  క్లారిటీ ఇచ్చాడు. అటు రచయిత ఐజాక్సన్   కూడా దీనిపై  స్పందించి స్పష్టత ఇచ్చారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top