‘మాఘమాసం’ వచ్చేసింది.. బంగారం ధరల్ని తగ్గించేసింది! | Check Prices And Latest Updates On Gold Rates In India | Sakshi
Sakshi News home page

‘మాఘమాసం’ వచ్చేసింది.. బంగారం ధరల్ని తగ్గించేసింది!

Published Sat, Feb 10 2024 1:03 PM | Last Updated on Sun, Feb 11 2024 12:55 PM

Check Prices And Latest Updates On Gold Rates In India - Sakshi

శుభ ముహూర్తాలకు మంచిరోజులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. దీంతో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ 4 వరకు శుభకార్యాలు చేసుకునేందుకు గాను పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఈ తరుణంలో ఇన్ని రోజులు రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.

మాఘమాసం ప్రారంభం కావడంతో శుభకార‍్యాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్‌ దృష్ట్యా కస్టమర్లను ఆకట్టుకునేలా వ్యాపారులు బంగారం ధరల్ని తగ్గించి అమ్మకాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 

ఫలితంగా ఫిబ్రవరి 10న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్లపై రూ.210 ధర తగ్గింది. 

ఇక దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.      

వైజాగ్‌ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.   

విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.   

బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.   

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600గా ఉంది

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది. 

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement