కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌!

Centre May Give Rs 10000 As Festival Advance To Its Employees On Holi - Sakshi

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త చెప్ప‌నుంది. హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే ఈ పండుగ‌కి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీవితాల్ని మ‌రింత రంగుల మ‌యం చేసేందుకు కేంద్రం ప్ర‌త్యేకంగా ఫెస్టివ‌ల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ప‌లు నివేదిక‌లు వెలుగులోకి వ‌చ్చాయి. 

కోవిడ్ కార‌ణంగా ఆర్ధిక ఇబ్బందులు ప‌డుతున్న కేంద్రం ఉద్యోగుల‌కు రూ.10,000 అడ్వాన్స్‌గా అందించ‌నుంది. ఉద్యోగులు ఎలాంటి వ‌డ్డీ లేకుండా హోలీకి ముందే రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకోవ‌చ్చు. దీనివల్ల వ్యాపారాలు ఊపందుకోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మంద గమనాన్ని అధిగమించవచ్చ‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చిన రిపోర్ట్‌ల‌లో పేర్కొన్నాయి.  

ఇప్ప‌టికే కేంద్ర ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతేడాది కూడా ఈ పథకాన్ని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం మళ్లీ అదే పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇక కేంద్రం అందించ‌నున్న ఈ రూ.10వేల అడ్వాన్స్ వారి అకౌంట్‌ల‌లో జ‌మ‌వుతాయి.ఉద్యోగులు తీసుకున్న మొత్తాన్ని10 వాయిదాల్లో నెల‌కు రూ.1000 చొప్పున రూ.10,000 మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా కేంద్రం వెస‌లు బాటు క‌ల్పించ‌నుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top