కో లొకేషన్‌ స్కాం.. ఆనంద్‌ సుబ్రమణియం అరెస్ట్‌ | CBI arrested Anand Subramanian In NSE Colocation Case | Sakshi
Sakshi News home page

అదృశ్య యోగి ఎవరు? ఆనంద్‌ సుబ్రమణియంని అరెస్ట్‌ చేసిన సీబీఐ

Feb 25 2022 12:07 PM | Updated on Feb 25 2022 12:12 PM

CBI arrested Anand Subramanian In NSE Colocation Case - Sakshi

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీని పట్టి కుదిపేస్తున్న కో లొకేషన్‌ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి ఆనంద్‌ సుబ్రమణియన్‌ను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అరెస్ట్‌ చేసింది. శుక్రవారం ఉదయం సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

దేశంలోనే పెద్ద స్టాక్‌ ఎక్సేంజీల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఈకి ఎండీగా పని చేసిన  చిత్రా రామకృష్ణకు సలహాదారుగా ఆనంద్‌ సుబ్రమణియన్‌ పని చేశారు. ఈ కాలంలో వీరిద్దరు కీలకమైన సమాచారం నిబంధనలకు విరుద్ధంగా అనైతికంగా లీక్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈమేరకు ఢిల్లీలో కేసు నమోదు అయ్యింది. 

ఈ కేసుకు సంబంధించి చిత్ర రామకృష్ణను ఇటీవల సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు చిత్రమైన అంశాలు వెలుగు చూశాయి. ఓ అదృశ్య యోగి సూచనల మేరకు తాను ‘అలా’ చేయాల్సి వచ్చిందని చిత్ర రామకృష్ణన్‌ చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అసలు ఎవరా అదృశ్య యోగి అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

ఈ తరుణంలో ఆనంద్‌ సుబ్రమణియన్‌ అరెస్ట్‌ అయ్యారు. సీబీఐ విచారణలో ఈ కుంభకోణంలో అదృశ్యంగా వ్యవహరించిన వ్యక్తికి సంబంధించిన కీలక సమాచారం వెల్లడవవచ్చని అంచనా

చదవండి:చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement