పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్‌ : ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో కీలక మార్పులు! | ITR Filing 2023-24: CBDT Issues ITR-2, ITR-3 Forms For Return Filing For AY 2024-25 - Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్‌ : ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో కీలక మార్పులు!

Published Fri, Feb 2 2024 7:38 PM | Last Updated on Fri, Feb 2 2024 8:49 PM

Cbdt Notified By Itr-2, Itr-3 For Fy 2023-24 - Sakshi

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విభాగం ఐటీఆర్‌ ఫైలింగ్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఆర్ధిక సంవత్సరం 2022-2023 ట్యాక్స్‌ ఫైలింగ్‌ సమయంలో ఐటీఆర్‌-2, ఐటీఆర్‌ -3 ఫారమ్స్‌ తప్పని సరిగా ఉపయోగించాలని సూచించింది. అందుకు చివరి గడువు జులై31, 2024కి విధించింది. 

అయితే ఎవరితే వ్యాపారం చేస్తూ వారికి వచ్చే ఆదాయంపై ట్యాక్స్‌ ఆడిట్‌ నిర్వహిస్తుంటే వారు తప్పని సరిగా అక్టోబర్‌ 31, 2024 లోపు ఐటీఆర్‌-3 ఫైల్‌ను తప్పని సరిగా చేయాలని కోరుంది.

ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ ఎవరు చేయాల్సి ఉంటుంది?
ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌పోర్టల్‌ వివరాల ప్రకారం.. వ్యక్తులు లేదంటే హెచ్‌యూఎఫ్‌.. అంటే హిందూ అన్‌ డివైడెడ్‌ ఫ్యామిలీ.. కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం.. మరీ సూటీగా చెప్పాలంటే కుటుంబ పార్టీ.. వ్యాపార పరిభాషలో హెచ్‌యూఎఫ్‌కు కర్త ఉంటాడు.. మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటాయ్‌.. కుటుంబసభ్యులే హక్కుదారు.. అలా ఉండి ట్యాక్స్‌ కట్టేవారు ఐటీఆర్‌-2ని తప్పని సరిగా ఫైల్‌ చేయాలి. 

ఐటీఆర్‌-1 ఫైల్‌  చేసేందుకు అనర్హులు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా వచ్చే ప్రాఫిట్, లాభాలు లేని వారు ఈ ఫామ్స్ ఉపయోగించాలి. వడ్డీ, శాలరీ, బోనస్ కమీషన్, రెమ్యునరేషన్ వంటి వాటి ద్వారా ప్రాఫిట్స్, ఇతర లాభాలు పొందని వారు, అలాగే జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు వంటి వారి నుంచి ఆదాయం అందుకుంటున్న వారు వారి ఆదాయం మొత్తాన్ని జమ చేసి ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది.


 ఐటీఆర్‌-2లో మార్పులు 
రాజకీయ పార్టీలకు చేసిన విరాళాల వివరాలు, వైకల్యం ఉన్న వ్యక్తి వైద్య చికిత్సతో సహా నిర్వహణకు సంబంధించి తగ్గింపు వివరాలు, ఇంకా, పన్ను ఆడిట్ చేయడానికి వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్యాక్స్ ఆడిట్ అవసరమైనప్పుడు వారు ఈవీసీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement