బడ్జెట్‌ షాక్‌ : ఆరంభ లాభాలు ఢమాల్‌!

Budget 2022 Market:Indices trades volatile - Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌ మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి వెనక్కి  తగ్గాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట లభించపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశకు  గురయ్యారు. దీంతో ఆరంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో అమ్మకాలు కొనసాగాయి. అయితే కార్పొరేట్‌ సంస్థలకు లబించిన  ఊరటతో ఊగిసలాట కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 891  పాయింట్ల లాభంతో 59 వేలకు దిగువన, నిఫ్టీ 223 పాయింట్ల లాభాలకు పరిమితమై 18 వేల దిగున ట్రేడయింది.  క్రమంగా  నష్టాల్లోకి జారుకుని  తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. ప్రధానంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో రంగ షేర్లు  నష్టపోతున్నాయి.

మరోవైపు భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో డిజిటల్ రుపీని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని జారీ చేయబోతున్నట్లు  వెల్లడించారు. డిజిటల్ అసెట్ల బదిలీపై 30శాతం పన్ను  రాయితీ ఇవ్వనున్నారు.

జనవరిలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం వల్లే సాధ్యమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే  మార్కెట్‌ విశ్లేషకులు మాత్రంనిర్మలాది మరో  2022-23 గ్రోత్‌ ఓరియెంటెడ్‌ బడ్జెట్‌ అంటూ ప్రశంసించారు. ముఖ‍్యంగా ఎంఎస్‌ఎంఈలకు లభించిన ఊరటను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.

2022-23 బడ్జెట్‌లో ఎమ్ఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు లభించాయి. ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌ ఏర్పాటుతోపాటు, ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈల  కోసం రానున్న అయిదేళ్లలో 6,000 కోట్ల రూపాయల  RAMP  కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు  తెలిపారు. అలాగే  స్టార్టప్‌ల కోసం  రూ.2 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని ప్రకటించడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top