
( ఫైల్ ఫోటో )
Stock Market Updates ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ నిన్న సాయంత్రం 52,769 పాయింట్ల వద్ద మార్కెట్ క్లోజ్ అవగా బుధవారం ఉదయం సెన్సెక్స్ 52,801 పాయింట్లతో మొదలైంది. ఉదయం 10 గంటలకు 52,690 పాయింట్ల వద్ద నమోదు అవుతోంది. మొత్తంగా 79 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ నిన్న 15,812 పాయింట్ల వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 15,808 పాయింట్లతో ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటలకు 27 పాయింట్లు నష్టపోయి 15,784 పాయింట్ల వద్ద కదలాడుతోంది.
మారుతి సుజూకి, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు పొందాయి.