BMW X3 20D M Sport Launched Price and Details - Sakshi
Sakshi News home page

బిఎమ్‌డబ్ల్యు నుంచి మరో లగ్జరీ కారు.. ధర రూ. 69.90 లక్షలు

Mar 6 2023 9:06 PM | Updated on Mar 6 2023 9:19 PM

Bmw x3 20d m sport launched price and details - Sakshi

2023 ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లో విరివిగా లగ్జరీ కార్లను విడుదల చేస్తున్న బిఎమ్‌డబ్ల్యు ఎట్టకేలకు మరో కొత్త కారుని విడుదల చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 20డి స్పోర్ట్' (X3 20d M Sport). దీని ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).

బిఎమ్‌డబ్ల్యు ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో 'ఎక్స్3' పెట్రోల్ వేరియంట్ నిలిపివేసింది. ఎక్స్3 20డి స్పోర్ట్ మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ కలిగి 190 హెచ్‌పి పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

(ఇదీ చదవండి: Hero Super Splendor XTEC: ఎక్కువ మైలేజ్, అప్డేటెడ్ ఫీచర్స్.. ధర ఎంతంటే?)

కొత్త బిఎమ్‌డబ్ల్యు ఎక్స్3 20డి స్పోర్ట్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో విండోస్ చుట్టూ బ్లాక్ అవుట్ ఫ్రేమ్, బ్లాక్ అవుట్ రూఫ్ రైల్, డిఫ్యూజర్ వంటి వాటితో పాటు ఇంటీరియర్‌లో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, లెదర్ స్టీరింగ్ వీల్‌, కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటివి పొందుతుంది.

బిఎమ్‌డబ్ల్యు ఇండియన్ మార్కెట్లో కొత్త తరం M2 కూపేని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లగ్జరీ మోడల్ దేశీయ విఫణిలో కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడిన మొదటి బిఎమ్‌డబ్ల్యు ఇదే అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement