ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!

Bluesky Alternative To Twitter - Sakshi

ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ వస్తోంది. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌డోర్సే ‘బ్లూస్కై’ అనే యాప్‌ బీటా వర్షన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ యాప్‌  యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

టెక్‌క్రంచ్‌ కథనం ప్రకారం.. బ్లూస్కై ప్రస్తుతం ఇన్‌వైట్‌-ఓన్లీ బీటా వర్షన్‌ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటివరకు 2 వేల మంది ఎంపిక చేసిన యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. 

ట్విటర్‌ మాదిరిగానే బ్లూస్కై యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను కూడా చాలా సింపుల్‌గా రూపొందించారు. 256 అక్షరాల వరకు నిడివితో యూజర్లు చాలా తేలికగా పోస్ట్‌లు చేయొచ్చు. ప్లస్‌ బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా సులువుగా ఫొటోలు జోడించొచ్చు. ట్విటర్‌లో ఉన్న ‘వాట్‌ ఈజ్‌ హాపెనింగ్‌?’ అన్న ఆప్షన్‌కు బదులుగా ఇందులో ‘వాట్స్‌అప్‌?’ అనే ఆప్షన్‌ ఉంది. అలాగే బ్లూస్కైలో షేర్‌, మ్యూట్‌, బ్లాక్‌ అకౌంట్స్‌ వంటి ఆప్షన్స్‌తో పాటు కొత్తవారిని కూడా యాడ్‌ చేసే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌ ఇందులో ఉంది.

(ఇదీ చదవండి: లేఆఫ్స్‌ వేళ ఫ్రెంచ్‌ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!)

యాప్‌ మధ్యలో ఇచ్చిన డిస్కవర్‌ ట్యాబ్‌ ద్వారా.. యూజర్లు ఎవరిని ఫాలో అవ్వాలి, సజెషన్స్‌, తాజా అప్‌డేట్స్‌ ఫీడ్‌ను తెలుసుకోవచ్చు.అలాగే నోటిఫికేషన్స్‌ ట్యాబ్‌ ద్వారా లైక్స్‌, రిపోర్ట్స్‌, ఫాలోస్‌, రిప్లయిస్‌ వంటివి చూసుకోవచ్చు. అయితే ఇందులో ప్రస్తుతానికి డెరెక్ట్‌ మెసేజ్‌ (డీఎం) ఫీచర్‌ లేదు. ట్విటర్‌ మాదిరిగానే బ్లూస్కైలో కూడా యూజర్లు సెర్చ్‌, ఫాలో, తమకు పోస్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్లను హోం టైమ్‌లైన్‌లో చూసుకోవచ్చు.

ఈ బ్లూస్కై ప్రాజెక్ట్‌ను 2019లోనే అభివృద్ధి చేసినప్పటికీ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, మరింతగా అభివృద్ధి చేసి  2022లో స్వతంత్ర కంపెనీగా ఆవిష్కరించారు. జాక్‌ డోర్సే ట్విటర్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ బ్లూస్కై గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో ఏ యాప్‌తో అయినా సరే పోటీ విధింగా ‍బ్లూస్కైని రూపొందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు. బ్లూస్కై గతేడాది 13బియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top