మిలియన్‌ యూనిట్ల తయారీ మైలురాయి దాటిన కేటీఎం

Bajaj KTM Partnership Crosses 1 Million Unit Production Motorcycle From Chakan Plant - Sakshi

హైదరాబాద్‌: ప్రపంచంలో నెంబర్‌ 1 ప్రీమియం మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ కేటీఎం భారతదేశంలో మిలియన్‌ యూనిట్ల తయారీ మైలురాయిని అధిగమించింది. పుణేలోని బజాజ్‌ చకన్‌ ప్లాంట్‌ నుండి 1 మిలియన్‌ కేటీఎం మోటార్‌ సైకిల్‌– కేటీఎం అడ్వెంచర్‌ 390 విడుదలైంది.  రికార్డు బైక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో  బజాజ్‌ ఆటో ఎండీ, సీఈఓ రాజీవ్‌ బజాజ్,  పియరర్‌ మొబిలిటీ ఏజీ (కేటీఎం మాతృ సంస్థ) సీఈఓ స్టీఫన్‌ పీరర్‌ (ఫొటోలో ఎడమ నుంచి కుడికి) తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రియన్‌ బ్రాండ్‌ కేటీఎం తన  సబ్‌–400 సీసీ మోటార్‌సైకిళ్ల దేశీయ, ఎగుమతి యూనిట్ల తయారీకి బజాజ్‌ ఆటోతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేటీఎం ఇండియా 2014లో 1,00,000వ మోటార్‌సైకిల్‌ను, 2020లో 5,00,000వ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కేవలం మరో మూడేళ్ల వ్యవధిలోనే కీలక మిలియన్‌ మైలురాయికి చేరుకోవడం గమనార్హం.

చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top