బజాజ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ వెహికల్‌

Bajaj Auto Released Coming Soon New Ectric Bike Freerider   - Sakshi

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో పోటీ పెరిగిపోతుంది. రోజుకో కంపెనీ సరికొత్త మోడల్‌ని ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో హీరో, ఈథర్‌, ఒకినావాలు సందండి చేస్తుండగా తాజాగా ఈ జాబితాలో బజాజ్‌ కూడా చేరనుంది. ఫ్రీ రైడర్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రేడ్‌మార్క్‌ రిజిస్టర్‌ చేయించింది. 

బజాజ్‌నుంచి..
ఇండియా టూ వీలర్‌ మార్కెట్లో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు దేశం మొత్తాన్ని చేతక్‌ స్కూటర్‌ ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత యూత్‌లో మంచి క్రేజ్‌ని పల్సర్‌ సాధించింది. ఇప్పటికే యూత్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న బైక్‌గా పల్సర్‌కి పేరుంది. మిగిలిన బజాజ్‌ మోడల్స్‌కి రూరల్‌ ఇండియాలో మంచి కస్టమర్‌ బేస్‌ ఉంది.

తాజాగా ఈవీ సెగ్మెంట్‌పైనా బజాజ్‌ దృష్టి సారించింది. ఇప్పటికే బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో ఉండగా మరో కొత్త మోడల్‌ను తీసుకు వస్తుంది. ఫ్రీ రైడర్‌ పేరుతో కొత్త స్కూటర్‌ని  తేనుంది.  దీనికి సంబంధించిన  ట్రేడ్‌ మార్క్‌ కోసం  మార్చి 1న అప్లయ్‌ చేస్తే.. జూన్‌ 1న ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.  

చదవండితగ్గిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్‌ని బట్టి డిస్కౌంట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top