బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ సరికొత్త మైలురాయి | Bajaj Allianz Life AUM crosses Rs 1 lakh crore mark | Sakshi
Sakshi News home page

బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ సరికొత్త మైలురాయి

Dec 14 2023 6:09 AM | Updated on Dec 14 2023 6:09 AM

Bajaj Allianz Life AUM crosses Rs 1 lakh crore mark - Sakshi

ముంబై: బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.లక్ష కోట్ల మైలు రాయిని అధిగమించాయి. దేశంలో టాప్‌–10 బీమా సంస్థలో వేగంగా వృద్ధిని సాధిస్తున్న కంపెనీల్లో ఒకటని తెలిపింది. 2019–20 నాటికి నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రూ.56,085 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. కంపెనీ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసానికి తాజా మైలురాయి నిదర్శనమని సంస్థ ఎండీ, సీఈవో తరుణ్‌ చుగ్‌ అభివరి్ణంచారు.

గడిచిన మూడేళ్లుగా వ్యక్తిగత నూతన వ్యాపార ప్రీమియంలో ఏటా 41 శాతం చొప్పున వృద్ధిని సాధించినట్టు చెప్పారు. జీవిత బీమా పరిశ్రమలో బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ మార్కెట్‌ వాటా 2019–20 నాటికి 2.6 శాతంగా ఉంటే, 2022–23 నాటికి 5 శాతానికి పెరిగినట్టు తెలిపారు. ప్రైవేటు జీవిత బీమా మార్కెట్లో తమ వాటా 4.6 శాతం నుంచి 7.6 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement