వచ్చేఏడాది ప్రముఖ కంపెనీ నుంచి 20 కొత్త మోడళ్లు | Audi To Drive In Over 20 New Models By 2025 End | Sakshi
Sakshi News home page

వచ్చేఏడాది ప్రముఖ కంపెనీ నుంచి 20 కొత్త మోడళ్లు

Mar 20 2024 12:41 PM | Updated on Mar 20 2024 1:22 PM

Audi To Drive In Over 20 New Models By 2025 End - Sakshi

జర్మనీ వాహన సంస్థ ఆడి వచ్చే ఏడాది చివరి వరకు పలు మార్కెట్లలో 20 కొత్త మోడళ్లు తీసుకురానుందని కంపెనీ సీఈఓ గెర్నాట్‌ డాల్నెర్‌ తెలిపారు. 

2027కు ప్రధాన విభాగాలను పూర్తిగా విద్యుత్‌కు మార్చాలని కంపెనీ భావిస్తోంది. 2024-28 మధ్య మూలధన వ్యయాలుగా 41 బిలియన్‌ యూరోలు (దాదాపు రూ.3.8 లక్షల కోట్లు) వెచ్చించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇంటర్నెల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ల అభివృద్ధి, ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర విభాగాలపై 11.5 బిలియన్‌ యూరోలు, బ్యాటరీ విద్యుత్‌ వాహనాలు, డిజటలీకరణలపై 29.5 బిలియన్‌ యూరోలను సంస్థ ఖర్చు చేయనుంది. 

ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. 

భారత్‌లో విద్యుత్తు కార్ల తయారీని చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆండ్రే వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో విదేశీ కంపెనీలు భారత్‌లో ఈవీలను ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement