సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు

Astronomers find biggest ever water reservoir billions light years away - Sakshi

ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. 

యూనిలాడ్‌ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది.

అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే  ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది.

నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్‌ బ్రాఫోర్డ్‌ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top