breaking news
Quasars
-
సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు
ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. యూనిలాడ్ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. -
విశ్వం నిర్మాణాన్ని తెలిపే నూతన మ్యాప్
వాషింగ్టన్: విశ్వం నిర్మాణానికి సంబంధించిన తొలి మ్యాప్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మ్యాప్ రూపకల్పనలో విశ్వవ్యాప్తంగా ఉన్న క్వాసార్స్ అనే ప్రకాశవంతమైన నక్షత్రాల్లాంటి నిర్మాణాలను ఖగోళ శాస్త్రవేత్తలు వాడారు. ‘ఈ క్వాసార్స్ అనేవి అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల లాంటి నిర్మాణాలు, ఇవి విశ్వమంతటా ఉన్నాయి. పెద్ద పెద్ద కృష్ణబిలాల వల్ల ఈ క్వాసార్స్లో కాంతి ఉద్భవించింది. క్వాసార్స్ అత్యంత కాంతివంతమైనవి కావున విశ్వవ్యాప్తంగా వీటిని మనం చూడవచ్చు. ప్రస్తుతం తాము ఈ క్వాసార్స్ సాయంతోనే విశ్వానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించగలిగాము’అని అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆష్టే రాస్ వెల్లడించారు.