రిలయన్స్‌ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ

Anil Ambani Reliance Group appoints Parul Sharma as Group President - Sakshi

సాక్షి, ముంబై:  అనిల్ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం చేసుకుంది. గ్రూప్ ప్రెసిడెంట్‌గా  పారుల్ శర్మను నియమించింది.  జూన్ 20 నుంచి ఈమె నియామకం అమల్లోకి వచ్చింది.

కమ్యూనికేషన్ వ్యూహకర్తగా మంచి అనుభవం ఉన్న శర్మ నియామకంతో  కంపెనీ పునర్‌వైభవాన్ని సంతరించు కునే  ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నారు. గ్రూప్ కార్పొరేట్ ఇమేజ్, పబ్లిసిటీ ,రిలేషన్ షిప్‌లతో సహా రూపర్ట్ మర్డోక్ యాజమాన్యంలోని స్టార్ ఇండియాలో 15 సంవత్సరాలపాటు పనిచేశారు. అలాగే  కొలోన్‌లో ఉన్న జర్మన్ బ్రాడ్‌కాస్టర్ 'డ్యుయిష్ వెల్లే'లో పనిచేశారు. (హైదరాబాద్‌లో కోరమ్‌ ‘డిస్ట్రిక్ట్‌150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు)

పారుల్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా చేరడంపై సంతోషాన్ని ప్రకటించారు అనిల్‌ అంబానీ.  గ్రూప్‌తో ఇది ఆమెకు తొలి వృత్తిపరమైన అనుబంధమే అయినా, టోనీ  భార్యగా  విస్తృత రిలయన్స్ కుటుంబంలో భాగమేననీ,  టోనీ జ్ఞాపకాలు, సేవలు, పారుల్ చేరికతో మరింత ప్రత్యేకంగా నిలుస్తాయని అనిల్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. శర్మ భర్త  రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్,  కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ టోనీ జేసుదాసన్‌ను ఈ ఫిబ్రవరిలో కన్నుమూశారు. దాదాపు 40 సంవత్సరాల పాటు టోనీ రిలయన్స్ గ్రూప్‌లో విశేష సేవలందించారు.

పారుల్‌ శర్మ మంచి రచయిత. 2020లోకరోనా మహమ్మారి వలసదారుల దుస్థితి , మరణాలపై 'డయలెక్ట్స్ ఆఫ్ సైలెన్స్' అనే పుస్తకాన్ని రచించారు. అలాగే 'కొలాబా' పేరుతో రాసిన మరో పుస్తుతం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. (రెండుసార్లు ఫెయిల్‌...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్‌ స్టోరీ)

పారుల్‌ మంచి ఫోటోగ్రాఫర్‌ కూడా.   2017లో ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టడానికి స్టార్‌  కంపెనీని వీడారు. అనేక దేశాల్లో ఆర్కిటెక్చర్, అర్బన్ ల్యాండ్‌స్కేప్‌లు అండ్‌ హ్యూమన్‌ ఫామ్స్‌  పై శర్మ పనిచేశారు. కుంభమేళాపై ఆమె చేసిన వర్క్‌  2019లో ప్రతిష్టాత్మక  ఫ్లోరెన్స్ పబ్లిక్ మ్యూజియం ‘మారినో మారిని’లో ప్రదర్శించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top