ప్రధాని మోదీ రోడ్‌షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆనంద్ మహీంద్రా..! ఏమన్నారంటే..? 

Anand Mahindra Thanks Modi for Using Made in India Mahindra Thar in Roadshow - Sakshi

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాలలో విజయ దుందుబి మోగించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. అక్కడ ప్రధానమంత్రి పలు రోడ్ షోలు నిర్వహించారు. కాగా ప్రధానమంత్రి రోడ్‌షోపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ధన్యవాదాలు పీఎం..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న రోడ్‌షోలలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్‌లను పక్కన పెట్టారు. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా కంపెనీకి చెందిన ఆఫ్‌ రోడ్‌ వెహికిల్‌ మహీంద్రా థార్‌లో ప్రయాణించారు. సుమారు 9 కిలోమీటర్లమేర మహీంద్రా థార్‌లోనే రోడ్‌షోను మోదీ నిర్వహించారు. 
 

మోదీ రోడ్ షోలో మహీంద్రా థార్‌ను వాడటంతో.. ఆనంద్ మహీంద్రా ఆయనకు థ్యాంక్స్ చెప్పుతూ ట్విట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా తన ట్వీట్‌లో..ఎన్నికల గెలుపు పరేడ్‌ను నిర్వహించేందుకు మేడిన్ ఇండియా వెహికిల్ కంటే మెరుగైనది ఏదీ లేదు. ధన్యవాదాలు ప్రధాని నరేంద్రమోదీ అంటూ ట్విట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు సుమారు 40 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. దేశవ్యాప్తంగా ఆఫ్‌ రోడ్‌ సెగ్మెంట్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీగా మహీంద్రా థార్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 

చదవండి: అమెరికన్‌ కంపెనీకి మరో గట్టి కౌంటర్‌ ఇచ్చిన రష్యా..!  అదే జరిగితే భారీ నష్టమే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top