ఇలా ఉన్నామంటే...అంతా ఆయన పుణ్యమే: ఆనంద్‌ మహీంద్ర నివాళులు | Anand Mahindra Mourns MS Swaminathan Who Passed Away Recently Shares A Video, Goes Viral - Sakshi
Sakshi News home page

ఇలా ఉన్నామంటే...అంతా ఆయన పుణ్యమే: ఆనంద్‌ మహీంద్ర నివాళులు

Published Sat, Sep 30 2023 2:39 PM

Anand Mahindra mourns MS Swaminathan who passed away recently shares a video - Sakshi

హరిత విప్లవ పితామహుడు, దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్‌ స్వామినాథన్‌ మృతిపై వ్యాపారవేత్త ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర సంతాపం ప్రకటించారు.  ఈ రోజు భారతదేశంలో ఆహార భద్రత  ఉందీ అంటే ఆయన పుణ్యమే.. దానికి మన అందరమూ రుణపడి ఉండాలి అంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయనతో కంపెనీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

2011లో మహీంద్రా సమృద్ధి అవార్డ్స్‌లో ఇయర్ అవార్డలు సందర్బంగా  వ్యవసాయంతో  సంస్థకున్న లోతైన సంబంధాల దృష్ట్యా, హరిత విప్లవ సారధిగా ఆయన అందించిన సేవలకు అగ్రి-ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో  సత్కరించుకున్నాం. అదే రోజు డిన్నర్‌లో స్వామినాథన్‌ గారితో ముచ్చటించడం  తన అద్భుత జ్ఞాపకాలలో ఒకటి అని వెల్లడించారు. అలాగే 2019లో, బలహీనంగా ఉన్నప్పటికీ, తమ కోసం ఒక వీడియో రికార్డు చేసి పంపించారంటూ గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. వ్యవసాయంలో అయనకున్న అపారమైన జ్ఞానం, వ్యవసాయం పట్ల మక్కువ 1.4 బిలియన్ల భారతీయుల జీవితాలను మరింత సురక్షితం చేసింది. కానీ ఆయన ఏ లోకాన ఉన్నా, ఆయన చుట్టూ ఉన్నపొలాలు మరింత సారవంతంగా ఉంటాయంటూ నివాళులర్పించారు. 

ఆయనకు భారత రత్న ఇవ్వాలి!

దీంతో నెటిజన్లను కూడా ఎంఎస్‌ స్వామినాథన్‌కు నివాళలర్పించారు. నిజానికి దేశానికి ఆయనందించిన సేవలకు ప్రతిఫలంగా భారత రత్న ఇవ్వాలి.. ఇది మన దేశ పరిశోధకులు , శాస్త్రవేత్తల సంఘానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందంటూ  కమెంట్‌ చేశారు.

కాగా 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో పుట్టిన మాంకోంబ్ సాంబశివన్ స్వామినాథన్ దేశీయ వ్యవసాయం రంగానికి ఎనలేని కృషి చేశారు.  ముఖ్యంగా మేలు రకపు, ఎక్కువ దిగుబడినిచ్చే వరి వంగడాలను రైతులకు అందించింది. ముఖ్యంగా 1960- 70లలో భారతదేశం  వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన సమూల మార్పులు, అభివృద్ధికి  ఆయనందించిన అపారమైన సేవలు, కృషి దేశీయ రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది.  ఈ నేపథ్యంలోనే భారతీయ అత్యున్నత  పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 98 ఏళ్ల వయసులో  గురువారం సెప్టెంబరు 28న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

 
Advertisement
 
Advertisement