
సాధారణంగా కొన్ని సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇస్తే చాలు అనుకుంటాయి. అయితే కొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. కంపెనీ లాభాలను పొందినప్పుడు.. ఉత్తమ పనితీరును కనపరిచిన ఉద్యోగులకు కార్లు, బైకులు వంటివి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇటీవల కేరళకు చెందిన ఒక కంపెనీ సీఈఓ.. జనరల్ మేనేజర్‌కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళకు చెందిన MyG చైర్మన్ అండ్ ఎండీ ఏకే షాజీ.. తన జనరల్ మేనేజర్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. జనరల్ మేనేజర్ కంపెనీ డీలర్‌షిప్ నుంచి బైకును తీసుకున్నాడు. సీఈఓ కొత్త బైక్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషించారు. బైక్ తీసుకునే సమయంలో వేగంగా వెళ్ళవద్దు, బాధ్యతాయుతంగా బైక్ రైడ్ చేయాలని సూచించారు.
జనరల్ మేనేజర్ అపెక్స్ గ్రే కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 తీసుకున్నాడు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.46 లక్షలు. కాలికట్‌లో ఆన్ రోడ్ ధర రూ. 4.41 లక్షలు.
ఇదీ చదవండి: భారత్‌లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650
కాంటినెంటల్ జీటీ 650 అనేది 650 సీసీ విభాగంలో ఎంతోమందికి నచ్చిన బైక్. ఇది 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 47 హార్స్ పవర్, 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి డిజైన్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.