
అమెరికన్ వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్.. ఇండియన్ మార్కెట్లో తన 'స్ట్రీట్ బాబ్ 117' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 18.77 లక్షలు (ఎక్స్ షోరూం). ధరలు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.
చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ బైకులో 1923 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5020 rpm వద్ద 91.18 Bhp పవర్, 2750 rpm వద్ద 156 Nm టార్క్ అందిస్తుంది. 13.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు.. 293 కేజీలు (కర్బ్). ఇది 49 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు & ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ వంటివి పొందుతుంది.
స్ట్రీట్ బాబ్ పొడవైన హ్యాంగర్ హ్యాండిల్‌బార్ పొందుతుంది. టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్‌బార్‌పై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి కొంత పాత మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొత్త పెయింట్ స్కీమ్ పొందుతుంది. టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్‌లు, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివి కూడా పొందుతుంది.
ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్