
సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేసే ఈ కంపెనీ ఇండియాలో కియా కారెన్స్ క్లావిస్ & కారెన్స్ క్లావిస్ ఈవీ లాంచ్ చేసింది.
కియా ఇండియా లాంచ్ చేసిన ఈ రెండు కార్లు నాలుగు నెలల్లోనే 21,000 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. కారెన్స్ క్లావిస్ 20,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందగా.. క్లావిస్ ఈవీ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లను పొందింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

కియా కారెన్స్ క్లావిస్ మంచి డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇది స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్, మూడవ వరుస యాక్సెస్‌ను సులభతరం చేయడానికి సెగ్మెంట్-ఫస్ట్ బాస్ మోడ్ వంటివి పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ పనోరమిక్ డిస్‌ప్లేలు, బోస్ 8 స్పీకర్ ఆడియో, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ డాష్‌క్యామ్ వంటివి మాత్రమే కాకుండా క్లైమేట్ కంట్రోల్/ఇన్ఫోటైన్‌మెంట్ స్వాప్ స్విచ్ వంటివి కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?
క్లావిస్ ఈవీ విషయానికి వస్తే.. ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. 42kWh యూనిట్ 404 కి.మీ రేంజ్ అందిస్తే.. 51.4kWh యూనిట్ 490 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. సేఫ్టీ పరంగా కూడా ఇవి రెండూ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.