
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి 'కేఎల్ఎక్స్230' బైకును రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు అందిస్తోంది. గత ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.30 లక్షలు. అంటే సంస్థ ధరను లోకలైజేషన్ కారణంగా ఇప్పుడు రూ. 1.30 లక్షలు తగ్గించింది.
స్థానీకరణ కారణంగానే కంపెనీ తన కేఎల్ఎక్స్230 ధరను చాలా తగ్గించింది. ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఈ బైక్ హీరో Xpulse 210, కేటీఎం 390 ఎండ్యూరో ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కంపెనీ తన కేఎల్ఎక్స్230 బైకును స్థానీకరణ చేయడం మాత్రమే కాకుండా.. కొన్ని యాంత్రిక మార్పులను కూడా చేసింది. ముందు భాగంలో 20 మిమీ, వెనుక 27 మిమీ సస్పెన్షన్ తగ్గించింది. అయితే రెండు చివర్లలో ఇప్పుడు పెద్ద డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 233 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ 19 హార్స్ పవర్, 19 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఈ బైకులో లభిస్తుంది.