
పునరుత్పాదక ఇంధనం అభివృద్ధిపై పెట్టుబడులు పెరుగుతున్నా, సాంప్రదాయక ఇంధన వనరులకు డిమాండ్ తగ్గట్లేదు. ఇది ప్రపంచ చమురు, గ్యాస్ రంగం అపారమైన ఆర్థిక, వ్యూహాత్మక వృద్ధిని సూచిస్తోంది. ఆగస్టు 2025 నాటికి పరిశ్రమలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ ఆరామ్‌కో 1.55 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది. భారత్‌కు చెందిన ఓఎన్‌జీసీ 34.33 బిలియన్ డాలర్లతో 45వ స్థానంలో ఉంది. మార్కెట్ విలువ పరంగా చమురు వాణిజ్యానికి సంబంధించి ప్రపంచంలోనే టాప్ కంపెనీల గురించి కింద తెలియజేశాం.

పైసమాచారం కంపెనీస్‌మార్కెట్‌క్యాప్.కామ్(ఆగస్టు 20, 2025 నాటికి) లోనిది. నిత్యం మార్కెట్ వ్యాల్యూయేషన్లను అనుసరించి క్యాపిటల్ మారుతుంటుందని గమనించాలి.
భారత్ స్థానం ఇదే..
ఏ భారతీయ కంపెనీ కూడా గ్లోబల్ టాప్ 10లో చోటు దక్కించుకోనప్పటికీ, భారతదేశపు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓన్‌జీసీ) 34.33 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!
టాప్ 100లో ఉన్న భారతీయ కంపెనీలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)- 56వ స్థానం
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)- 68వ స్థానం
గెయిల్ (ఇండియా) లిమిటెడ్ - 79వ స్థానం
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)- 95వ స్థానం