
భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' విధించిన సుంకాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పందిస్తూ.. దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) కీలక సూచనలు చేశారు.
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా.. భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో అమెరికా మనదేశం మీద విధించిన సుంకం మొత్తం 50 శాతానికి చేరింది. టారిఫ్‌ల గురించి ఆందోళన చెందకుండా.. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించే ప్రయత్నాలు చేయాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
1991 నాటి ఫారెక్స్ సంక్షోభం ఎలాగైతే ఆర్థిక సరళీకరణకు దారి తీసిందో.. అదే విధంగా ఈ టారిఫ్‌ల మథనంలో మనకు తప్పకుండా అమృతం దక్కుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. దీనికోసం రెండు బలమైన అడుగులు వేయాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.
వ్యాపారాలను మెరుగుపరచాలి
భారతదేశంలో పెరుగుతున్న సంస్కరణలకు మించి అన్ని పెట్టుబడి ప్రతిపాదనలకు సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను సృష్టించాలి. ప్రపంచ పెట్టుబడులకు మన దేశాన్ని వేదికగా మార్చాలి. అప్పుడే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితుంది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడులను వేగవంతం చేయాలి. వీటికి కావలసిన ప్రోత్సాహకాలను అందించాలి. దిగుమతి సుంకాలను క్రమబద్దీకరించాలి. పోటీతత్వాన్ని మెరుగు పరచాలని, మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలి.
పర్యాటక రంగాన్ని మెరుగుపరచాలి
పర్యాటకం అనేది విదేశీ మారకం. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలి. పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచాలి. ఇప్పటికే ఉన్న హాట్‌స్పాట్‌ల కారిడార్‌లను నిర్మించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చేయాలి. అంతే కాకుండా.. ఇతర ప్రాంతాలు జాతీయ ప్రమాణాలను అనుకరించడానికి మరియు పెంచడానికి ప్రోత్సహిస్తాయి.
The ‘law of unintended consequences’ seems to be operating stealthily in the prevailing tariff war unleashed by the U.S.
Two examples:
The EU may appear to have accepted the evolving global tariff regime, responding with its own strategic adjustments. Yet the friction has… pic.twitter.com/D5lRe5OWUa— anand mahindra (@anandmahindra) August 6, 2025